Advertisementt

గడ్డాలకు అలవాటు పడుతున్నారు..!

Sun 02nd Apr 2017 01:29 AM
tollywood heroes,heroes beard look look,nithiin,ram,raviteja,ram charan  గడ్డాలకు అలవాటు పడుతున్నారు..!
గడ్డాలకు అలవాటు పడుతున్నారు..!
Advertisement
Ads by CJ

ఒకప్పటి స్టార్స్‌ గడ్డం పెంచడమంటే ఇబ్బందిగా ఫీలయ్యేవారు. చిరు, బాలయ్యలు చిరు గడ్డంతో కనిపించారు. ఇక నాగ్‌ కూడా కొన్ని చిత్రాలలో గడ్డంలో కనిపించాడు. తాజాగా  విడుదలైన 'గురు'లో కూడా వెంకటేష్‌ గడ్డంతో కనిపించాడు. 'నాన్నకు ప్రేమతో'లో ఎన్టీఆర్‌ గడ్డం పెంచాడు. ఇక 'బాహుబలి' విషయానికి వస్తే జక్కన్న నుంచి రానా వరకు అందరూ గడ్డాలతోనే కనిపించేవారు. ఇక తాజాగా సుకుమార్‌ చిత్రం కోసం రామ్‌చరణ్‌, హనురాఘవపూడితో చేస్తున్న కొత్త చిత్రం 'లై'లో నితిన్‌, కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రామ్‌ చేయబోయే చిత్రాలలో కూడా హీరోలు గడ్డాలతోనే కనిపించనున్నారు. ఇక పెప్పర్‌సాల్ట్‌ లుక్‌ని అజిత్‌, రజనీలు ట్రెండ్‌గా తీసుకొచ్చారు. ఇక జగపతిబాబు, నాగబాబు నుంచి కొత్తవారు కూడా ఇలాగే కనిపించేందుకు తహతహలాడుతున్నారు. ఇక బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ఈ పని ఎప్పుడో చేశాడు. మరి మన సీనియర్‌ హీరోలైనా భవిష్యత్తులో పెప్పర్‌సాల్ట్‌ లుక్‌తో కనిపిస్తారా? లేదా? అనేది ఆసక్తికర అంశం. ఇక తెలుగులో చాలా కాలం కిందట రవితేజ, జెడి చక్రవర్తిల గడ్డాలు కూడా బాగా యూత్‌లో బజ్‌ను క్రియేట్‌ చేశాయన్న సంగతి తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ