Advertisementt

ప్రభాస్ 'బాహుబలి' రెమ్యూనరేషన్ తెలుసా?

Sat 01st Apr 2017 02:25 PM
prabhas,bahubali,prabhas remuneration,baahubali  ప్రభాస్ 'బాహుబలి' రెమ్యూనరేషన్ తెలుసా?
ప్రభాస్ 'బాహుబలి' రెమ్యూనరేషన్ తెలుసా?
Advertisement
Ads by CJ

'బాహుబలి ద కంక్లూజన్' చిత్రం ఏప్రిల్ 28  న విడుదల చేస్తామని రాజమౌళి మరియు నిర్మాతలు డేట్  ఫిక్స్ చేశారు. ఇందుకు అనుగుణంగా పబ్లిసిటీ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేసింది బాహుబలి టీమ్. అసలు బాహుబలికి కావాల్సినంత పబ్లిసిటీని మీడియా ఎప్పటినుండో మొదలు పెట్టింది. కానీ రాజమౌళి కూడా చేతులు కట్టుకుని కూర్చోకుండా బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు పబ్లిసిటీ కార్యక్రమాలపై కూడా పూర్తి దృష్టి పెట్టాడు. ఇక ఈ చిత్రంలో నటించిన నటీనటులు మాత్రం తమ తమ ఇతర చిత్రాలతో  బిజీ అయిపోయారు. బాహుబలితో ఆ చిత్రంలో నటించిన వారి పేర్లు కూడా ప్రపంచ వ్యాప్తం గా మార్మోగిపోయాయి.

ఇక బాహుబలి చిత్రంలో హీరోగా నటించిన ప్రభాస్ తప్ప మిగతా వారు బాహుబలి షూటింగ్ తో పాటే ఇతర చిత్రాలను చుట్టేశారు. కానీ ప్రభాస్ మాత్రం గత ఐదేళ్లుగా పూర్తి సమయాన్ని బాహుబలికే కేటాయించాడు. మరి ఐదేళ్లకు బాహుబలి చిత్రానికే టైం స్పెండ్ చేసిన ప్రభాస్ ఆ చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ దండి ఉంటాడో అని చర్చ మొదలైంది టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో. అయితే బాహుబలి చిత్రానికి గాను ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే విషయం ఇంతవరకు ఎక్కడా బయటకి రాలేదు. కానీ ప్రభాస్ బాహుబలి చిత్రానికి మొదటి భాగానికి గాను 20  కోట్లు, రెండవ భాగానికి గాను 30  కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు బయట టాక్ మొదలైంది. అయితే ఇది నిజమా లేక రూమరా అనేది మాత్రం తెలియదు గాని నిర్మాతలు ప్రభాస్ ని నీకెంత కావాలని అడగగా ప్రభాస్ మాత్రం నోరు తెరిచి ఇంతకావాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదట. 

కానీ నిర్మాతలే ప్రభాస్ పడిన కష్టానికి ప్రతి ఫలంగా అంతటి రెమ్యునరేషన్ ఇచ్చేశారని అంటున్నారు. మరి ప్రభాస్ నిజంగా ఐదేళ్ల కష్టానికి ఆ రెమ్యునరేషన్ కరక్టే అనిపిస్తుంది కదా..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ