Advertisementt

'గురు'..26 యేళ్ళ క్రితమే తీశారు..!

Sat 01st Apr 2017 12:02 PM
guru,ashwini,venkatesh,ritika singh,sudha kongara  'గురు'..26 యేళ్ళ క్రితమే తీశారు..!
'గురు'..26 యేళ్ళ క్రితమే తీశారు..!
Advertisement

వెంకటేశ్‌ నటించిన 'గురు' సినిమా ఈ తరం ప్రేక్షకులకు కొత్తగా అనిపించవచ్చు. క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలు విరివిరిగా వస్తున్న సీజన్‌ ఇది. అందుకే హిందీ చిత్రం 'సాలాఖుద్దూస్‌' ఆధారంగా తీసిన 'గురు' వెరైటీ అంటున్నారు. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్‌ సినిమా తెలుగులో 26 యేళ్ళ క్రితమే వచ్చింది. ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ 'అశ్విని' పేరుతో కోచ్‌, అథ్లెటిక్‌ ప్రధాన పాత్రధారులుగా తీశారు. ఇండియాలో అథ్లెటిక్‌గా పేరు తెచ్చుకున్న అశ్వినీ నాచప్పను నాయికగా తీసుకుని, కల్పిత కథతో 'అశ్విని' తీశారు. కోచ్‌గా భానుచందర్‌ నటించారు. స్లమ్‌ ఏరియాలో నివసించే సాధారణ యువతిలోని ప్రతిభను గుర్తించిన కోచ్‌ ఆమెను ప్రోత్సహించి ఛాంపియన్‌ చేస్తాడు. క్రీడా రాజకీయాల వల్ల కోచ్‌ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. సరిగ్గా 'గురు' సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు కనిపించడం విశేషం. 'గురు' దర్శకురాలు సుధా కొంగరకు అశ్విని సినిమా గురించి తెలిసి ఉండదు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement