Advertisementt

చాన్నాళ్ళకి కొత్తగా ట్రై చేశాడు..!

Fri 31st Mar 2017 09:40 PM
lie,nithiin,hanu raghavapudi,lie movie poster,nithiin look in lie  చాన్నాళ్ళకి కొత్తగా ట్రై చేశాడు..!
చాన్నాళ్ళకి కొత్తగా ట్రై చేశాడు..!
Advertisement
Ads by CJ

యంగ్‌హీరో నితిన్‌ కెరీర్‌ మొదలై 15 సంవత్సరాలైంది. ఈ కాలంలో ఆయన ఇరవైకి పైగా చిత్రాలు చేశాడు. వీటిల్లో ఆయన కథాపరంగా వైవిధ్యం చూపించాలని భావించాడు. 'జయం, ఇష్క్‌, గుండెజారి గల్లంతయిందే' వంటి ప్రేమకథాచిత్రాలు, 'సై, దిల్‌' వంటి విభిన్నచిత్రాలతో పాటు మాస్‌ఇమేజ్‌ కోసం ఎందుకు పనికి రాని చిత్రాలు కూడా చేసి దెబ్బైపోయాడు. కానీ ఇంతకాలంగా కాస్త 'హార్ట్‌ఎటాక్‌'లో తప్పితే నితిన్‌ చిత్రాల కథపరంగా వైవిధ్యం చూపించాలని భావించాడేమో గానీ లుక్‌ పరంగా మాత్రం విభిన్నంగా ప్రయత్నించలేదు. 

కానీ ఇప్పుడు నితిన్‌ చేత యంగ్‌టాలెంటెడ్‌ టెక్నీషియన్‌గా 'అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రాలతో నిరూపించుకున్న హనురాఘవపూడి ఆ పని చేయిస్తున్నాడు. ప్రస్తుతం 14రీల్స్‌ పతాకంపై నితిన్‌ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ విభిన్న చిత్రం రూపొందుతోంది. ఇందులో నితిన్‌ హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన యువకునిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలో జరుగుతోంది. జులైలో విడుదల కానున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇప్పటికే విడుదలై మంచి స్పందన రాబట్టింది. 

నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో పాటు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇక ఈ చిత్రానికి ఇంగ్లీషులో 'లై' అనే టైటిల్‌ను పెట్టి, గడ్డంతో ఉన్న వెరైటీ నితిన్‌ లుక్‌ని రివీల్‌ చేసి, ఎల్‌.ఐ.ఇ. కి డిఫరెంట్‌ ట్యాగ్‌నిచ్చారు. కాగా ఇప్పటివరకు తెలుగులో 'అబద్దం' అనే పేరుతో వచ్చిన చిత్రాలన్నీ పెద్దగా ఆడలేదు. మరి ఈ ఇంగ్లీషు అబద్దం ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి...! మరి ఈ 'లై'..  'అ..ఆ'  తర్వాత నితిన్‌కి ఆ స్థాయి హిట్‌ని అందిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది.....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ