పవన్ తన సినిమాల ఎంపికలో బాలయ్య రూట్‌లో వెళ్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. బాలయ్య కూడా ఓ పవర్‌ఫుల్ టైటిల్, ఓ మంచి కమర్షియల్ పాయింట్‌ని చెప్పి, పవర్‌ఫుల్ హీరోయిజం ఉండే డైలాగ్స్‌ని మూడు నాలుగు చెబితే వలలో పడిపోతాడనే బోళాశంకరుడనే పేరు బాలయ్యకి ఉందని ఇండస్ట్రీలో చెబుతుంటారు. ఇక పవన్ కూడా అదే రూట్‌లో వెళ్తున్నాడా? అనిపిస్తోంది. కనీసం బాలయ్య సొంత కథలకే ప్రాధాన్యం ఇస్తాడు. కానీ పవన్ ఏరికోరి రీమేక్‌లను ఎంచుకుంటున్నాడు. ఇక అన్ని విషయాలలో నేనింతే అని బిహేవ్ చేసే బాలయ్యలాగానే పవన్ కూడా ఉంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి.
రాజమౌళి, వినాయక్, బోయపాటి, కొరటాల శివ, సుకుమార్, సురేందర్‌రెడ్డిలతో పాటు క్రిష్ వంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్‌ని పవన్ ఎంచుకోగలగాలి. కొత్తవారికి, న్యూటాలెంట్‌ను వెతకదలుచుకుంటూ నాగ్‌ను ఫాలో అవ్వాలి. సేఫ్ గేమ్ ఆడాలంటే తన అన్న చిరు, బన్నీ వంటి వారి రూట్‌లోకి రావాలి. అంతేగానీ సోకాల్డ్ దర్శకులను ఆయన పక్కనపెట్టాలి. కాగా పవన్ తన కెరీర్‌లో త్రివిక్రమ్‌కి తప్ప మరెవ్వరికీ అవకాశం ఇవ్వడం లేదు. ఇక రాజమౌళి, వినాయక్, విక్రమ్ కె.కుమార్ వంటి దర్శకులతో చేస్తే వారు హీరోల ఇంటర్ ఫియరెన్స్‌ను, జోక్యాన్ని ఒప్పుకోరని, అందుకే పవన్ తాను చెప్పినట్లు వినే దర్శకుల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడనే విమర్శలు కూడా వస్తున్నాయి.
వీటిని దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యత పవన్‌పై ఉంది. రొటీన్ చిత్రాలు చేయాలనుకుంటే తన అన్న చిరుని, విభిన్న చిత్రాలను చేయాలంటే అమీర్ వంటి వారిని ఫాలో అయి, తనకు కమర్షియల్ సక్సెస్‌లు ముఖ్యమా? లేక అద్భుతమైన చిత్రాలు చేశాడనే పేరు ముఖ్యమా? అనే విషయంలో ఓ నిర్ణయానికి రావాలి. అంతే కానీ రెంటికి చెడ్డ రేవడిలా మాత్రం పవన్ మిగలకూడదు...!