Advertisementt

సినిమాలు ప్రేక్షకుల కోసమా? ఫ్యాన్స్‌ కోసమా?

Fri 31st Mar 2017 06:41 PM
top heroes,star heroes,fans,audience,pawan kalyan,mahesh babu  సినిమాలు ప్రేక్షకుల కోసమా?  ఫ్యాన్స్‌ కోసమా?
సినిమాలు ప్రేక్షకుల కోసమా? ఫ్యాన్స్‌ కోసమా?
Advertisement

సినీహీరోలకు మరీ ముఖ్యంగా స్టార్స్‌కి అభిమానులు, ఇమేజ్‌, క్రేజ్‌ వంటివి ఉండటం సహజం. ఎవరికైనా ఇది ముఖ్యం. అభిమానులు కూడా ప్రేక్షకులే. కానీ ప్రేక్షకులందరూ అభిమానులు కారనేది వాస్తవం. సినీ ప్రేక్షకుల్లో సినీ ప్రేమికులు, అందరి హీరోల అభిమానులు, ఫ్యామిలీ ప్రేక్షకులు, చిన్నపిల్లలు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాల వారుంటారు. వీరందరినీ మెప్పిస్తేనే ఏ చిత్రమైనా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. కానీ కేవలం తమ అభిమానుల కోసం, వారిని సంతృప్తి పరచడం కోసం చేస్తే ఆ చిత్రాల ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. 

ఓ స్టార్‌ హీరో సినిమా బాగున్నా బాగలేకపోయినా ఇతర హీరోల అభిమానులు కూడా ధియేటర్లకు వెళ్లి చూస్తారు. ఆయా హీరోల చిత్రాలను కామెంట్లు చేసి, విమర్శించడానికైనా యాంటీ ఫ్యాన్స్‌ చూస్తారు. కానీ ఇవి ఓపెనింగ్స్‌ వరకే పరిమితం. సినిమాకు యూనానిమస్‌ టాక్‌ వస్తే గానీ నేడు ఫ్యామిలీ ప్రేక్షకులు, మహిళలు ఇళ్లను, బుల్లితెరను వీడి, వేల రూపాయలు ఖర్చుపెట్టిరావడం లేదు. అన్నిచిత్రాలను ఏదో కాలక్షేపం కోసం, టైంపాస్‌ కోసం చూసే రోజులు పోయాయి. కానీ నేడు పలు స్టార్స్‌చిత్రాల విడుదలకు ముందు జరిగే వేడుకలు, ప్రమోషన్స్‌లో తమ హీరో నుండి ఫ్యాన్స్‌ ఏమి ఆశిస్తారో? అన్ని అంశాలు పుష్కళంగా ఉంటాయని స్టేట్‌మెంట్స్‌ ఎక్కువై పోతున్నాయి. ఈ ధోరణి మారాలి... ! 

అంతేగానీ కేవలం మా అభిమానులే మాకు ప్రాణమని చెప్పి ఓ పవన్‌లాగా, లేదా తమ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ ఇంకా విడుదల కాకపోయి, ఫ్యాన్స్‌ నిరుత్సాహం తొలగించడానికి మహేష్‌వంటి స్టార్స్‌ చేసే విజ్ఞప్తులు, వేడుకోలు చూస్తే నేటి హీరోలు ప్రేక్షకుల కోసం కాకుండా ఫ్యాన్స్‌ కోసమే చిత్రాలు చేస్తున్నారనే అభిప్రాయానికి రావాల్సివస్తుంది. ఇది ప్రమాదకర సంకేతమేనని చెప్పాలి...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement