ఒక హీరో చేసే చిత్రాల గురించి మాట్లాడాలంటేనే మరోస్టార్ హీరోకి ఇగోలు ఎక్కువగా ఉన్న రోజులివి. నిజమైన మల్టీస్టారర్స్‌ని కూడా వీరి నుండి ఆశించలేం. కావాలంటే సీనియర్ స్టార్స్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తారేమో గానీ సల్మాన్, షారుక్, అమీర్‌లలాగా తమ జనరేషన్‌కే చెందిన వారితో కలిసి నటించడం వీరికి చేతకాదు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఏమీ సామాన్యుడు కాదు. ఆయన తన కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు బ్లాక్‌బస్టర్స్ పడగానే ఆయన శైలి ఏమిటి? అనేది చాలా మందికి చిరపరిచితమే.
కానీ ఈమధ్య ఎన్టీఆర్‌లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఇది మెచ్యూరిటీ, వయసు పెరగడం, జీవిత సత్యాలు ఎదురు కావడం, ఇక పెళ్లి తర్వాత ఆయన భార్య తీరు వల్ల ఎన్టీఆర్ కెరీర్ పరంగా కథ విషయంలో, డైరెక్టర్ల విషయంలోనే కాదు.. ఇతర విషయాలలో కూడా హుందాగా, ఇగోలకు దూరంగా ఉండటం అలవర్చుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ నట జీవితంతో ఇద్దరు దర్శకులు ఆయనకు మంచిచేదోడు వాదోడు. దాదాపు అటు ఇటుగా తాను సోలో హీరోగా మారి, యంగ్‌స్టార్‌గా ఎదిగినప్పుడే తమ కెరీర్‌లను కూడా ప్రారంభించి, ఎన్టీఆర్‌తో బ్లాక్‌బస్టర్ చేసిన వినాయక్, రాజమౌళిలే వారు. వారితో ఎన్టీఆర్‌కి అవినాభావ సంబంధం ఉంది.
ఇక ఎన్టీఆర్-రాజమౌళిల కాంబినేషన్‌లో ఇప్పటికే 'స్టూడెంట్ నెంబర్1, సింహాద్రి, యమదొంగ' చిత్రాలు వచ్చాయి. మరలా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం ఎప్పుడు వస్తుందా? అని ఎందరో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ 'బాహుబలి' స్టాల్ వద్దకు వెళ్లి, అందులోనే కత్తి, డాలు పట్టుకుని ఫోజులివ్వడం అందరినీ సంతోషపరిచింది. ఇక బాబి చిత్రం కోసం న్యూలుక్‌లో ఉన్న ఎన్టీఆర్ స్టైల్ కూడా అదుర్స్ అనేలా ఉంది.