ప్రస్తుతం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దక్షిణాది ఏస్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ ద్విభాషాచిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కానీ ఇది సినిమాపై హైప్ తెస్తుందని మురుగదాస్ భావించాడు. కానీ అది ఆయనకు ఎదురు తిరిగినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌లను జనవరి1 వ తేదీన నూతన సంవత్సర కానుకగా అందిస్తామన్నారు. ఆ తర్వాత సంక్రాంతి, ఇక మహాశివరాత్రిలు కూడా గడిచిపోయాయి. తాజాగా ఉగాదికి ఫస్ట్‌లుక్ టైటిల్ పోస్టర్ ఉంటుందని భావించారు. కానీ అదీ వాయిదా పడింది.
కాగా ప్రస్తుతం యూనిట్ వియత్నాంలో యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో ఉంది. దీంతో ఉగాది నాడు తెలుగు సంవత్సరాది సందర్బంగా మురుగదాస్ మహేష్ అభిమానులకు ట్విట్టర్ ద్వారా ఉగాది శుభాకాంక్షలు తెలిపాడు. అంతే మహేష్ అభిమానుల్లో అసహనం, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో వీరు మురుగదాస్ ట్విట్టర్‌పై దాడి మొదలుపెట్టారు. ఉగాది శుభాకాంక్షలు సరే ముందు టైటిల్, ఫస్ట్‌లుక్ సంగతేమి చేశావని ఆయన్ను నిలదీశారు. మహేష్ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ రాని తమకు ఉగాది జరుపుకోవాలనిపించడం లేదంటూ మురుగను టార్గెట్ చేశారు.
మొత్తానికి ఈ చిత్రం టైటిల్ ఫిక్స్ అయిందని, టైటిల్ సాంగ్‌ను కూడా రికార్డు చేశారని వార్తలు వస్తున్నాయి. మరి టైటిల్‌ను ఇంకా దాచడం ఎందుకో అర్దం కావడం లేదు. సినిమా రిలీజ్ డేట్ తప్పితే దేనికీ సమాధానం రావడం లేదు. మరి మురుగదాస్.. మహేష్‌ను తమిళ ప్రేక్షకులకు దగ్గర చేయడానికి తమిళ సంవత్సరాది అయిన ఏప్రిల్ 14ను ఎంపిక చేసుకుంటాడేమో అనే వాదన కూడా ఉంది.