Advertisementt

మహేష్‌ ఫ్యాన్స్‌కు మరోసారి తప్పని నిరాశ!

Thu 30th Mar 2017 07:41 PM
mahesh babu,ar murugadoss,ugadi,mahesh babu new movie  మహేష్‌ ఫ్యాన్స్‌కు మరోసారి తప్పని నిరాశ!
మహేష్‌ ఫ్యాన్స్‌కు మరోసారి తప్పని నిరాశ!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు.. మురుగదాస్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా మహేష్‌ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ జోడీగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీస్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తుండగా, ఎన్వీప్రసాద్‌, ఠాగూర్‌ మధులు సంయుక్తంగా మహేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. 

ఎప్పుడో షూటింగ్‌ పూర్తి అవుతుందని ప్రకటించినా ఈ చిత్రం షూటింగ్‌ ఇంకా పూర్తికాలేదు. కాగా ప్రస్తుతం వియత్నాంలో కొన్ని యాక్షన్‌ సీన్స్‌ని, ఛేజింగ్‌ సీన్స్‌ను హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. వియత్నాంలో షూటింగ్‌ జరుపుకుంటున్న రెండో దక్షిణాది చిత్రం ఇదే కావడం గమనార్హం. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను, టైటిల్‌ను ఉగాది రోజున విడుదల చేస్తారని వార్తలు వస్తూ వున్నాయి. దీంతో ఉగాది రోజైనా మహేష్‌ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌లు రిలీజ్‌ అవుతాయని మహేష్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. 

కానీ ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టైటిల్ గురించి ఈ ఉగాది కి కూడా ఏం తెలియనివ్వలేదు. దీంతో మహేష్‌బాబు అభిమానులకు మరోసారి నిరుత్సాహం ఎదురైంది. కాగా ఈ చిత్రం యూనిట్‌ వియత్నాంలో షూటింగ్‌ ముగించుకొని త్వరలో చెన్నై రానుంది. ఆ తర్వాత ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టైటిల్స్‌ను ఎప్పుడు విడుదల చేస్తారో అఫీషియల్‌గా ప్రకటించనున్నారని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ