Advertisementt

చైతూ అభిమానుల సందడి చూద్దామా..!

Thu 30th Mar 2017 07:11 PM
soggade chinni nayana,naga chaitanya,kalyana krishna,rarandoi veduka chudham,rakul preet singh  చైతూ అభిమానుల సందడి చూద్దామా..!
చైతూ అభిమానుల సందడి చూద్దామా..!
Advertisement
Ads by CJ

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన తండ్రి నాగార్జునకు తన తొలి చిత్రంతోనే 'సోగ్గాడే చిన్ననాయనా' వంటి బ్లాక్‌బస్టర్‌నిచ్చిన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో చైతూ సరసన టాప్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది. ముందుగా అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి 'రారండోయ్‌ వేడుక చూద్దాం' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేశారు. కాగా ఈ చిత్రాన్ని నాగార్జున తమ సొంత బేనర్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్నాడు.

ఇక ఈ చిత్రం నాగ్‌ నటించిన 'నిన్నేపెళ్లాడతా' తరహాలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, పెళ్లినేపథ్యంలో కనుల పండుగగా ఉంటుందని ఇప్పటికే నాగ్‌ తెలిపాడు. ఇక ఈ చిత్రం మొదటి రెండు లుక్స్‌ను ఉగాది కానుకగా విడుదల చేశారు. ఒక స్టిల్‌లో చైతూ కుర్తా పైజమా వేసుకొని ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తుంటే, పోస్టర్‌ నిండా పెళ్లివేడుక బ్యాక్‌డ్రాప్‌లో మెడకు డోలు కట్టుకుని రకుల్‌ప్రీత్‌సింగ్‌ చిందులు వేస్తూ పాట పాడుతోంది. 

మరోలుక్‌లో చైతూ మాస్‌లుక్‌లో కనిపిస్తున్నాడు. రౌడీలను చితగొట్టి, కిందపడిపోయిన రౌడీలు, నులక మంచాల బ్యాక్‌డ్రాప్‌లో మరో వ్యక్తి వెనకాల పరుగెడుతున్నట్లు ఉన్న మరోస్టిల్‌లో చైతూ తలపై చిన్న గాయానికి ప్లాస్టర్‌ వేసుకొని కనిపిస్తున్నాడు. మొత్తం మీద ఈ రెండు లుక్‌లు అక్కినేని ఫ్యాన్స్‌ను అలరించేలా ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా చైతూ మరో కొత్త ట్రెండ్‌ చిత్రాలకు శ్రీకారం చుట్టి, మొదటి బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనిపించేలా ఈ లుక్స్‌ కేక పుట్టిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ