సంక్రాంతి సీజన్‌తో పాటు సమ్మర్‌సీజన్‌లో వచ్చే చిత్రాలు కూడా దాదాపు కన్‌ఫర్మ్ అయ్యాయి. ఇక తర్వాత రాబోయేది దసరా సీజన్. దీనికోసం మన స్టార్స్ ఇప్పటి నుంచే స్కెచ్‌లు మొదలుపెట్టారు. కాగా మొత్తంగా నలుగురు స్టార్స్ ఈసారి దసరాను టార్గెట్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ, పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్29న విడుదల కానుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ దర్శకత్వంలో 'జై లవకుశ' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుండటంతో ఇది కూడా దసరా కానుకగానే విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇక రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. దీనిని కూడా దసరా బరిలోకి దించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక తాజాగా 'కాటమరాయుడు'గా వచ్చిన పవన్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 6 నుండి రెగ్యులర్‌గా జరగనుంది. మొదటిరోజు షూటింగ్ నుంచే పవన్ పాల్గొననున్నాడు. ఈ చిత్రాన్ని కూడా వేగంగా పూర్తి చేసి దసరా బరిలోకి దింపాలనే ఆలోచనలో యూనిట్ ఉంది.