Advertisement

ప్రభాస్‌ కూడా స్వార్ధపరుడేనా..!

Wed 29th Mar 2017 10:15 PM
prabhas,baahubali,sujith,prabhas own banners,uv creations  ప్రభాస్‌ కూడా స్వార్ధపరుడేనా..!
ప్రభాస్‌ కూడా స్వార్ధపరుడేనా..!
Advertisement

ప్రభాస్‌ నేడు తెలుగు హీరో మాత్రమే కాదు.. యావత్‌ భారతదేశంలోని అన్ని భాషల్లో ఆయనకు నేడు గుర్తింపు ఉంది. 'బాహుబలి-ది బిగినింగ్‌'తో 500కోట్ల హీరోగా మారిన ఆయన 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌'తో 1000కోట్ల మార్కెట్‌ను సొంతం చేసుకోవడం ఖాయమని ఎందరో నమ్మకంతో ఉన్నారు. ఒకే ఒక్క చిత్రం ఈయన్ను ఆ స్థాయికి తీసుకెళ్లింది. ఇక 'బాహుబలి'కి ముందు ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'మిర్చి'నే కావడం విశేషం. ఆయన మార్కెట్‌ 50కోట్లకు అటు ఇటుగా మాత్రమే ఉండేది. కానీ అది గతం. ఇది వర్తమానం. 

'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' తర్వాత ప్రభాస్‌తో చిత్రాలు చేసేందుకు బయటి నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక 'మిర్చి' చిత్రం ద్వారా ఆయన తన యువి క్రియేషన్స్‌కి ప్రారంభం చుట్టాడు. ఇక 'బాహుబలి' తర్వాత కూడా ఆయన సుజీత్‌ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌లోనే 150కోట్లతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ప్రభాస్‌ తన తర్వాతి మూడు చిత్రాలను కూడా తన స్వంత సంస్థలైన యువి క్రియేషన్స్‌, గోపీకృష్ణ బేనర్‌లకే చేయనున్నాడని సమాచారం. 

యువి క్రియేషన్స్‌లో సుజీత్‌ చిత్రంతో పాటు 'జిల్‌' రాధాకృష్ణతో ఓ చిత్రం, తాజాగా తమిళ దర్శకుడు అట్లీతో ఓ చిత్రం చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇక గోపీకృష్ణ బేనర్‌లో ఆయన కృష్ణంరాజును దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం చేసే అవకాశం ఉంది. మొత్తానికి పెరిగిన తన క్రేజ్‌ను ప్రభాస్‌ కేవలం తన స్వంతవారికే లబ్దిచేకూర్చేలా చేయాలని భావిస్తున్నాడు. అయినా నేడు చిరంజీవి నుంచి పవన్‌ వరకు, మహేష్‌ నుండి అందరు స్టార్స్‌ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు కదా....! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement