బాలకృష్ణ తాజాగా పూరీ జగన్నాథ్ చిత్రంలో నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఇప్పటికే జెట్ స్పీడ్‌తో జరుగుతోంది. సినిమా ప్రారంభం రోజునే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు. కాగా ఇది పూరీ చిత్రం కావడంతో అనుకున్న తేదీకే ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందని ఖచ్చితంగా నమ్మవచ్చు.
మరోపక్క ఎన్టీఆర్ బాబి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండటంతో పాటు ఇందులో ఆయన విలన్ పాత్రను కూడా చేయనుండటంతో ఈ చిత్రం షూటింగ్ చిత్రీకరణకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఇక విలన్ గెటప్‌కి చెందిన మేకప్‌కి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉండటం, సినిమా అనుకున్న సమయం కంటే ఆలస్యంగా పట్టాలెక్కడంతో ఈ చిత్రం కూడా సెప్టెంబర్ చివరి వారంలోనే విడుదల అవుతుందనే టాక్ నడుస్తోంది.
వాస్తవానికి ఈ చిత్రాన్ని మొదట ఆగష్టు11న విడుదల చేయాలని భావించారు. కానీ ఈ చిత్రం ఆలస్యం కావడం.. ఖాయంగా కనిపిస్తోంది. ఇక బాలయ్య, ఎన్టీఆర్‌లు గత సంక్రాంతికి కూడా పోటీ పడ్డారు. బాలయ్య 'డిక్టేటర్'గా వచ్చి ఫ్లాప్ అయితే ఎన్టీఆర్ మాత్రం 'నాన్నకు ప్రేమతో'తో విజయం సాధించాడు. దీంతో వీరిద్దరు మరలా సెప్టెంబర్ చివరి వారంలో పోటీపడనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. చూద్దాం.. ఇది నిజమవుతుందో లేదో...?