ఎన్ని నెగటివ్ రివ్యూలు, డివైడ్ టాక్‌లు వస్తున్నా సరే పవన్ నటించిన 'కాటమరాయుడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధించినట్లు అనధికార సమాచారం. ఇప్పటికీ పలు కేంద్రాలలో ఈ చిత్రం అన్ని షోలు ఫుల్ అవుతున్నాయని తెలుస్తోంది. మరోపక్క ఈ చిత్రం శాటిలైట్‌హక్కులు, ఇతర డిజిటల్ హక్కులు, ఆడియో హక్కులన్నీ కలుపుకుని ఈ చిత్రం సునాయాసంగా 100కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయమంటున్నారు.
ఇక ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందటంతో ఈచిత్రం ద్వారా శరత్‌మరార్‌కు, పవన్‌కి బాగా గిట్టుబాటు అయిందనే తెలుస్తోంది. కానీ 'సర్దార్‌గబ్బర్‌సింగ్' డిజాస్టర్ తర్వాత దానికి పరిహరంగా ఈ చిత్రం నిర్మించడం, అయినా కూడా 100కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ సాధించడంతో ఈ చిత్రం ద్వారా కూడా బయ్యర్లు నష్టపోతారనే వార్తలు వ్యాపిస్తున్నాయి. కానీ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఈచిత్రం వసూళ్లు సాధిస్తూ, 'ఖైదీ'ని కూడా దాటిన నేపథ్యంలో ఈ చిత్రం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టాలు ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
'సర్దార్' చిత్రం పవన్ అభిమానులను కూడ డిజప్పాయింట్ చేసిందని, కానీ 'కాటమరాయుడు' చిత్రం మాత్రం పవన్ అభిమానులకు మంచి విందు భోజనమే అని టాక్ వస్తుండటం ఈ చిత్రానికి బాగా కలిసొస్తోంది. కాగా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా కలెక్షన్లు సాధిస్తోందని ట్రేడ్ ఎనలిస్ట్, క్రిటిక్ ఉమేర్ సంధు తేల్చిచెప్పడం గమనార్హం. కానీ ఉమేర్.. సర్దార్ సమయంలో మౌనంగా ఉండి, కాటమరాయుడుకు మాత్రం బ్లాక్‌బస్టర్ ట్యాగ్ ఇవ్వడంతో ఈ చిత్రం మంచి వసూళ్లను సాదిస్తున్నట్లు విమర్శకులు కూడా ఒప్పుకుంటున్నారు.