Advertisementt

సూర్య పై ఇలాంటి వార్తలా..!

Wed 29th Mar 2017 09:02 PM
suriya,rumors on suriya,suriya caste rumors  సూర్య పై ఇలాంటి వార్తలా..!
సూర్య పై ఇలాంటి వార్తలా..!
Advertisement
Ads by CJ

ఇటీవల సోషల్‌ మీడియాలో  తమిళ, తెలుగు హీరో సూర్య మసీదులో ప్రార్ధనలు చేసినట్లు, ముస్లింల టోపీలతో ఉన్న వీడియో, ఫొటోలు హల్‌చల్‌ చేశాయి. దాంతో చాలామంది సూర్య మతం మారుతున్నాడంటూ ప్రచారం మొదలుపెట్టారు. కాగా దీనిపై సూర్య వివరణ ఇచ్చాడు. తాను మతం మారినట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. కానీ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సూచన మేరకు తాను ఒకసారి కడపలోని మసీదును సందర్శించినట్లు చెప్పాడు. అంతేగానీ తాను మతం మారడం లేదని స్పష్టం చేశాడు. 

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే సూర్యపై ఇలాంటి వార్తలు రావడంతో చాలా మంది షాక్‌ అయ్యారు. దీనిపై విస్తృతమైన చర్చ కూడా జరిగింది. మొత్తానికి ఈ విషయంలో సూర్య తాజాగా స్పందించి, ఆ వీడియోను కూడా తీసి వేయడంతో ఈ విషయంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. కాగా 'ఎస్‌ 3' చిత్రం తర్వాత ప్రస్తుతం సూర్య విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది చివరలో విడుదల కానుంది. ఇక ఆయన ప్రస్తుతం తన భార్య జ్యోతిక నటిస్తున్న ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ