Advertisementt

ఇంకా రీమేక్ లేంటయ్యా బాబు..!

Wed 29th Mar 2017 08:29 PM
remake movies,katamarayudu,khaidi no 150,guru,dhruva,tollywood  ఇంకా రీమేక్  లేంటయ్యా బాబు..!
ఇంకా రీమేక్ లేంటయ్యా బాబు..!
Advertisement
Ads by CJ

ఈమధ్య మన స్టార్స్‌ బాగా రీమేక్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. చిరు 'ఖైదీ నెంబర్‌150', చరణ్‌ 'ధృవ', పవన్‌ 'కాటమరాయుడు' ఇప్పుడు వెంకీ 'గురు' చిత్రాలు చేస్తున్నారు. కానీ నేటి ఆధునిక సాంకేతిక యుగంలో రీమేక్‌ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సివుంది. చిరు 'కత్తి'ని రీమేక్‌ చేస్తున్నాడని తెలియగానే ఆ చిత్రం తమిళ వెర్షన్‌ చూడని వారు సైతం దాని సీడీలలో ఇతర సోషల్‌ మీడియాలో  చూశారు. దాంతో చిరు దశాబ్దం తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో అందరూ ఈ చిత్రాన్ని చూశారు. కానీ ఇదే 'కత్తి' రీమేక్‌ కాకుండా చిరు స్ట్రెయిట్‌ కథ అయి ఉంటే 'ఖైదీ' కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చి ఉండేవనేది వాస్తవం. ఇక చెర్రీ 'తని వరువన్‌' రీమేక్‌గా 'ధృవ' చేస్తున్నాడని తెలియడంతో ఆ చిత్రాన్ని కూడా మన సినీ ప్రేమికులు ఒరిజినల్‌ వెర్షన్‌ని చూసేశారు. దీంతో ఈ చిత్రం బాగా ఉన్నప్పటికీ అనుకున్న లాభాలు తీసుకొని రాలేకపోయింది. 

ఇక వెంకీ నటిస్తున్న తాజా చిత్రం 'గురు' పట్ల కూడా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వెంకీ చిత్రానికి రావాల్సిన బజ్‌ ఈ చిత్రానికి రావడం లేదు. దీనికి కారణం కూడా ఇదే చిత్రం ఆల్‌రెడీ హిందీ, తమిళంలో వచ్చి ఉండటమేనని విమర్శకులు అంటున్నారు. ఇక పవన్‌ అయితే తమిళ రీమేక్‌ను అందునా తెలుగులో డబ్‌ అయిన 'వీరం' ( వీరుడొక్కడే)ని 'కాటమరాయుడు'గా చేశాడు. ఇక పవన్‌ ఈ చిత్రం చేస్తున్నాడని తెలిసిన వెంటనే సాదారణ ప్రేక్షకులు కూడా ఈచిత్రాన్ని పనిగట్టుకుని చూసేశారు. ఒకప్పుడు రీమేక్‌లంటే మినిమమ్‌ గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ నేటి ఆధునిక యుగంలో ఒక్క క్లిక్‌తోనే ఆ చిత్రం ఒరిజినల్‌ను చూసే అవకాశం వస్తోంది. 

గతంలో వెంకటేష్‌, సూపర్‌గుడ్‌ఫిల్మ్‌, రవిరాజా పినిశెట్టి, భీమనేని శ్రీనివాస్‌ అనే రీమేక్‌ స్పెషలిస్ట్‌లు ఉన్నారు. కానీ అది నేడు వీలుకాదు. గతంలో మోహన్‌బాబు హీరోగా నటించిన 'రౌడీగారిపెళ్లాం' పార్తిపన్‌, సీత నటించిన చిత్రంగా థియేటర్లలో విడుదలైంది. భాగ్యరాజా నటించి తెలుగులో డబ్‌ అయి విజయం సాధించిన చిత్రాలనే మోహన్‌బాబు, వెంకటేష్‌లు చేశారు. అప్పుడు..ఓకే.. ఇప్పుడు అలా చేయడం ఆత్మహత్యాసదృశ్యమేనని చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ