నేడు చాలామంది మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న తర్వాత హుందాగా వ్యవహరించకుండా రిటైర్ అయ్యే స్థితిలో అనవసరపు వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కారణమవుతున్నారు. తమ హుందాతనాన్ని కోల్పోతున్నారు. ఇదే పరిస్థితి సంగీత దర్శకుడు కీరవాణికి ఎదురవుతోంది. ఆయన తాజాగా తాను చాలా మంది బ్రెయిన్ లేని దర్శకులతో పనిచేశానని, వారు కేవలం తనను ఒక సంగీత దర్శకునిగా మాత్రమే చూశారని, తన సలహాలను, సూచనలు పాటించలేదని, ఇక నుండి తన మాట వినేవారితో, తన శ్రేయోభిలాషులతోనే చిత్రాలు చేస్తానని ప్రకటించాడు. దీనిపై వివాదం ముదురుతోంది.
తన రెండు దశాబ్దాల కెరీర్‌లో కీరవాణి ఎందరో దర్శకులతో పనిచేశారని, తీరా 'బాహుబలి'తో జాతీయ గుర్తింపు వచ్చేసరికి తాను పనిచేసిన చాలా మంది దర్శకులకు బ్రెయిన్ లేదని వ్యాఖ్యానించాడని పలువురు మండిపడుతున్నారు. పనిచేసినంత కాలం పనిచేసి ఇప్పుడు బ్రెయిన్ లేని వారు అని ఎలా మాట్లాడుతాడు? ఆయన మరో భాషలోకి వెళ్లమనండి. ఆయనకు అక్కడ కనీసం గుర్తింపు కూడా రాదు. మరి మేమంతా బ్రెయిన్‌లేని వారిమైతే మాతో అప్పుడెందుకు పనిచేశాడు? మరి ఆయనే దర్శకత్వం వహించవచ్చుకదా...! ఆయనేమీ దేవుడు కాదు.. ఆయన కొన్ని మంచి సినిమాలు చేసినట్లే కొన్ని సార్లు నాసిరకంగా సంగీతాన్ని, కాపీ చేసిన సంగీతాన్ని అందించాడు.
ఆయన 'బాహుబలి'కి అందించిన బ్యాగ్రౌండ్ కూడా ఓ హలీవుడ్ చిత్రానికి కాపీనే. ఆయన గతంలో కూడా ఎన్నోసార్లు కాపీలు కొట్టాడు. మీరు త్వరగా ఎప్పుడు రిటైర్ అవుతారా? అని ఎదురుచూస్తున్నాం. మీరు లేనంత మాత్రాన సంగీత దర్శకుల కొరత ఏమీ లేదు. ఎందరో యంగ్ టాలెంటెడ్ సంగీత దర్శకులు మన వద్ద ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక కీరవాణి.. వర్మను చూపించడంతో ఈ వివాదం ముదురుతోంది. నిజమే.. గతంలో కీరవాణి తమిళంలో, హిందీలో తన పేరును మార్చుకొని సంగీతం అందించినా కూడా అక్కడ రాణించలేకపోయేడనేది వాస్తవం. ఇక కీరవాణి అంటే గానగంధర్వుడైన కె.జె. ఏసుదాస్ కూడా మండిపడతానేది వాస్తవం.