Advertisementt

'కాటమరాయుడు'కు బంపర్‌ ఆఫర్‌!

Wed 29th Mar 2017 03:48 PM
katamarayudu,bumper offer,nri,katamarayudu overseas,pawan kalyan  'కాటమరాయుడు'కు బంపర్‌ ఆఫర్‌!
'కాటమరాయుడు'కు బంపర్‌ ఆఫర్‌!
Advertisement
Ads by CJ

పవన్‌ నటించిన తాజా 'కాటమరాయుడు' చిత్రం టాక్‌కు సంబంధం లేకుండా కలెక్షన్ల వసూలు సృష్టిస్తోంది. ఇక ఓవర్‌సీస్‌లో కూడా ఈ చిత్రం హవా సాగుతోంది. వీకెండ్‌ వరకు బెనిఫిట్‌ షోలతో సహా మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో 'అత్తారింటికి దారేది'ని దాటుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మిలియన్‌ మార్కును దాటిన ఈచిత్రం బిజినెస్‌ క్లోజ్‌ సమయానికి రెండు మిలియన్‌ మార్కును దాటడం ఖాయం అంటున్నారు. కాగా వీకెండ్స్‌ అయిపోవడంతో ఈ చిత్రం కలెక్షన్లు డ్రాప్‌ అవుతున్నాయి. దాంతో అమెరికాలోని పలు టిక్కెట్లను అమ్మే మొబైల్‌యాప్‌లు ఈ చిత్రానికి బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 

రెండు లేదా అంతకంటే ఎక్కువ టిక్కెట్లు కొనే వారికి మరో టిక్కెట్‌ను ఫ్రీగా ఇస్తున్నారు. మరి కొన్ని చోట్లైతే ఒక టిక్కెట్‌ కొంటే మరో టికెట్‌ను ఫ్రీగా ఇస్తున్నారు. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ఎన్నారైలు మంచి ఆసక్తి చూపుతూ దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరోపక్క ఈ బంపర్‌ ఆఫర్‌ను చూసిన పవన్‌ యాంటీ ఫ్యాన్స్‌ ఈ సినిమా పరిస్థితి ఇంతేనా? ఒక టిక్కెట్‌ కొంటే మరో టిక్కెట్‌ ఫ్రీ అని అనడం బట్టి ఈ సినిమా స్థాయిని అంచనా వేయవచ్చని సెటైర్లు విసురుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ