పవన్‌ని వర్మ ట్వీట్స్‌తో రెచ్చగొడుతున్నాడు. కానీ పవన్ మాత్రం పెద్ద మనిషిగా మౌనం వహిస్తున్నాడు. కానీ కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న వీరాభిమానులు, సోకాల్డ్ పవన్ మద్దతుదారుడైన బండ్ల గణేష్ వంటి వారి మూలంగా వర్మ.. పవన్‌పై ఇంకా దాడి చేస్తూనే ఉన్నాడు. ఇది చివరకు ఎక్కడికి దారి తీస్తుందో కూడా తెలియని విషయంగా మారింది. పవన్‌పై తీవ్రంగా విరుచుకుపడిన వర్మను బండ్ల అదే పనిగా రెచ్చగొట్టాడు. వర్మ ఓ వీధికుక్క అని, ఆయనకు సినిమాలు తీయడం రాదని, పవన్ కాలిగోటికి, పవన్ చెప్పులకు కూడా వర్మ సరితూగడని వ్యాఖ్యానించాడు.
ఆయన ఓ భారతీయుడైనందుకు సిగ్గుపడుతున్నామని, ఆయన టెర్రరిస్ట్‌ల కంటే దారుణమని, ఎక్స్‌పైర్ అయిన టాబ్లెట్ వంటి వాడని ఇలా ట్వీట్స్ చేశాడు. ఇంకేముంది.. వర్మ కాస్త మౌనం పాటించాడు. దాంతో వర్మ బండ్ల దెబ్బకు సమాధానం చెప్పలేకపోతున్నాడంటూ కొందరు రెచ్చిపోయారు. కానీ వర్మ మాత్రం మరలా బండ్లను కౌంటర్ చేస్తూ ట్వీట్స్ మొదలుపెట్టాడు.
తాను కనీసం మొరిగేకుక్కనని, మొరిగే వీధికుక్క కనీసం కరవనైనా కరుస్తుందని, కానీ మూతులు నాకే కుక్క వంటి గణేష్ ఎలుకల కంటే హీనమని ట్వీట్ చేశాడు. దీంతో కొందరి మూలంగా పాపం పవన్ చివరకు ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఈ వివాదానికి తెరదించే పరిస్థితి వచ్చిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.