Advertisementt

అట్లీ...ప్రభాస్ ని పట్టేందుకేనా..?

Wed 29th Mar 2017 03:09 PM
atlee,prabhas,baahubali pre release event,atlee with wife  అట్లీ...ప్రభాస్ ని పట్టేందుకేనా..?
అట్లీ...ప్రభాస్ ని పట్టేందుకేనా..?
Advertisement
Ads by CJ

'బాహుబలి ద కంక్లూజన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా నిర్వహించారో తెలిసిన విషయమే.  ఈ ఈవెంట్ కి బాహుబలితో సంబంధం లేని వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే వచ్చారు. వారిలో కృష్ణంరాజు, హీరో నాని, తమిళ యంగ్ దర్శకుడు అట్లీ. వీరు మాత్రమే బాహుబలితో సంబంధం లేకుండా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. మిగతావాళ్ళు మొత్తం బాహుబలి టీమ్ మెంబర్స్ మాత్రమే ఈ ఈవెంట్ లో హడావిడి చేశారు. 

అయితే కృష్ణంరాజు.. ప్రభాస్ పెదనాన్న కాబట్టి ఈ ఫంక్షన్ కి వచ్చారని సరిపెట్టుకోవచ్చు. ఇక నాని కూడా రాజమౌళితో 'ఈగ' సంబంధం వుంది కాబట్టి వచ్చాడనుకోవచ్చు. కానీ తమిళ కుర్ర దర్శకుడు అట్లీ వైఫ్ ప్రియా తో సహా ఎందుకు హాజరైనట్టు. ఇప్పుడదే చర్చ టాలీవుడ్ లో జరుగుతుంది. అంటే ప్రభాస్ ఈ బాహుబలి ఈవెంట్ లో ఎలాగూ ఏడాదికి రెండు సినిమాలతో అభిమానులను సంతోష పెడతానని మాట ఇచ్చాడు. కాబట్టి .... ఇప్పుడు ఎలాగూ సుజిత్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మరి రెండో సినిమాని అట్లీ డైరెక్షన్ లో చేయబోతున్నాడా? అనే ప్రశ్న టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే డైరెక్టర్ అట్లీ 'రాజా రాణి, తేరి' వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి సక్సెస్ బాటలో వున్నాడు. ఇప్పుడు అట్లీ విజయ్ తో మరో సినిమా చేస్తున్నాడు. సుజిత్ తో ప్రభాస్ సినిమా పూర్తవగానే... అట్లీ - ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందా? అనే డౌట్ క్రియేట్ అయ్యింది.. అట్లీ ఈ బాహుబలి ఈవెంట్ కి హాజరవడంతో. మరి నిజంగానే ప్రభాస్ తో అట్లీ ఒక సినిమా చేస్తే అది మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగే ఉంటుందని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ