బాలీవుడ్ నటుడు సచిన్ జోషి, టాలీవుడ్ కమెడియన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. కానీ వారి మధ్యన ‘నీ జతగా నేనుండాలి’ చిత్రం చిచ్చు పెటింది. ఆ సినిమా ఘోర పరాజయం పాలవడంతో ఇద్దరి మధ్యన గొడవ రాజుకుంది. అదిగో అప్పటి నుండి ప్రాణ స్నేహితులు కాస్తా ఉప్పు నిప్పులా మారిపోయి మాటల యుద్ధంతో పాటే పోలీస్ కేసుల వరకు వెళ్లారు. ఆ మధ్యన బండ్ల గణేష్, సచిన్ జోషిని నానారకాల మాటలతో రెచ్చగొట్టాడు. సచిన్ జోషి తనకు డబ్బు ఎగ్గొట్టాడని... అతనొక చీటర్ అని అబ్బో చాలానే చదివాడు చాట భారతం. సచిన్ తో ‘నీ జతగా నేనుండాలి’ సినిమా తియ్యడం వలన నేను ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బతిన్నానని బండ్ల ఆరోపించాడు.
అయితే బండ్ల కి సమాధానంగా సచిన జోషి ఇప్పుడు స్పందించాడు. బండ్ల గణేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. బండ్ల గణేష్ ఒక ఇడియట్ అని... గణేష్ పై 14 చెక్ బౌన్స్ కేసులున్నాయని.. అవన్నీ లీగల్ కేసులేనని సచిన్ తెలిపాడు . అతన్ని జైలుకి పంపుదామని అనుకున్న టైంలో బండ్ల తండ్రి తన వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకోవడంతో అతన్ని జైలుకు పంపకుండా వదిలేసానని లేకుంటే జైలు ఊచలు లెక్కపెట్టిన్చేవాడినని తెలిపాడు. ‘నీ జతగా నేనుండాలి’ సినిమా కోసం తన దగ్గర డబ్బు తీసుకుని గణేష్ తననే మోసం చేసాడని, అతను తోడేలు వంటి వాడని..గట్టిగానే ఆరోపణలు చేశాడు సచిన్.
మరి సచిన్ ఘాటు వ్యాఖ్యలకు గణేష్ ఎలా స్పందిస్తాడో చూద్దాం?