కాటమరాయుడు చిత్రం విడుదలై దాదాపు మూడు రోజులు కావొస్తుంది. అయితే కలెక్షన్స్ లో మాత్రం చాలా తేడా కనబడుతుందని అంటున్నారు. రోజులు పెరిగే కొలది కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నట్లు చెబుతున్నారు. అసలు కాటమరాయుడు కి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతోనే ఇలా జరిగిందని ప్రచారం జరుగుతుంది. అసలు కాటమరాయుడు చిత్రంకి ఇంతలా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడానికి కారణం కూడా ఉందట. అదేమిటంటే కాటమరాయుడు చిత్రం తమిళ వీరంకి రీమేక్ అని అందరికి తెలిసిందే. తమిళం లో కూడా వీరం సినిమా అజిత్ కున్న ఫాలోయింగ్ కారణంగానే ఆ సినిమా యావరేజ్ టాక్ తో ఆడింది.
అయితే అజిత్ కి ఉన్న క్రేజ్ ని తెలుగులో కూడా క్యాష్ చేసుకుందామని ఆ ప్రొడ్యూసర్స్ ఇక్కడ తెలుగులో డబ్ చేసి విడుదల చెయ్యగా ఇక్కడ థియేటర్స్ లో అస్సలు ఆడలేదు. తెలుగులో వీరుడొక్కడేగా డబ్ అయిన ఈ చిత్రాన్ని ఒక ప్రముఖ ఛానెల్ శాటిలైట్ రైట్స్ కొనుక్కుని ఆ చిత్రాన్ని దాదాపు కొన్ని వందలసార్లు వాళ్ళ ఛానెల్ లో ప్లే చేశారు. ఇక టీవీలో సినిమా అంటే కుటుంబ సభ్యులు ఏదో ఒకసారి ఖచ్చితంగా చూస్తారు. మరి అన్ని వందల సార్లు టీవీలో వేస్తే చూడక ఏం చేస్తారు.
అలా తెలుగులో కూడా డబ్ అయిన ఆ చిత్రాన్ని మళ్ళీ పవన్ క్రేజ్ కారణంగా తెలుగులో రీమేక్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఎంతవరకు పవన్ కళ్యాణ్ క్రేజ్ సినిమాని కాపాడుతుంది. సినిమాని ఎంతగా భుజాలమీద మోసిన కూడా ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదుగా.. అంతేకాకుండా స్టోరీ లైన్ పరమ రొటీన్ గా ఉండడం కూడా ఈ సినిమాకి మైనస్ అని అంటున్నారు. మరి కాటమరాయుడు చిత్రం ఇంతలా నెగెటివ్ టాక్ రావడానికి మెయిన్ కారణమైతే అజిత్ చిత్రమే అంటున్నారు.