'బాహుబలి ద కంక్లూజన్' ఆడియో కమ్ ప్రీ రిలీజ్ వేడుక 'బాహుబలి' టీమ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది హైద్రాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో. ఈ ఈవెంటుకి హాజరైన ప్రతి ఒక్కరూ జయహో రాజమౌళి అంటూ నినాదాలు చేశారు. మరి ఒక్క ప్రీ రిలీజ్ వేడుక నే ఇంత అద్భుతం గా చేసిన రాజమౌళి అండ్ టీమ్.. సినిమాను ఇంకే లెవల్లో తెరకెక్కించారో... అది కూడా ఒక్క నెలలో తెలిసిపోనుంది. ఏది ఏమైనా బాహుబలి గురించి కొన్ని సంవత్సరాలు మాట్లాడుకునే లా చెక్కాడు రాజమౌళి. అయితే ఈ కష్టాన్ని కేవలం తన భుజాల మీద మాత్రమే వేసుకోకుండా... ఈ సినిమా గురించి తెర ముందు తెర వెనుక కష్టపడ్డ టెక్నీషియన్స్ అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపి రాజమౌళి ద గ్రేట్ అనిపించుకున్నాడు.
ఇక ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ.. నేను ఒక్కడినే బాహుబలి డైరెక్ట్ చెయ్యలేదని మరో దర్శకుడు కూడా బాహుబలి కి పని చేశాడని చెప్పి షాక్ ఇచ్చాడు. అతనెవరో కాదు.. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా బాహుబలిలో కొంతభాగాన్ని డైరెక్ట్ చేసాడని రాజమౌళి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తనతోపాటు తన ఫ్యామిలీ కూడా బాహుబలి చిత్రానికి ఎంతో కష్టపడి పనిచేసిందని అందులో కార్తికేయ ఇంకా ఎక్కువ కష్టపడ్డాడని చెప్పాడు. అలాగే కొన్ని సీన్స్ ని డైరెక్ట్ చెయ్యడమే కాకుండా 'బాహుబలి ద కంక్లూజన్' ట్రైలర్ ని రెడీ చేసింది కూడా కార్తిక్ అని చెప్పాడు రాజమౌళి.
అలాగే రాజమౌళి, కార్తికేయ గురించి మాట్లాడుతూ తన కొడుక్కి డైరెక్టర్ అవ్వాలని లేదుగాని ముందు నిర్మాతగా మారి సినిమాకు ఖర్చు పెట్టె ప్రతి ఒక్క రూపాయి విలువ తెలుసుకున్నాకే డైరెక్షన్ డిపార్మెంట్ లోకి అడుగుపెట్టాలని ఉందని చెప్పాడు. మరి ఇలాంటి విషయాల్లో గురువు రాఘవేంద్ర రావు ని తలదన్నే రీతిలో రాజమౌళి తయారైనట్టే ఇప్పుడు రాజమౌళి ని తలదన్నే రీతిలో ఆయన కొడుకు కార్తికేయ తయారయిన ఆశ్చర్యపోవక్కర్లేదు మరి.