Advertisementt

వెంకటేష్ వరుస ఇలా వుంది..!

Mon 27th Mar 2017 09:54 PM
venkatesh,sankalp reddy,puri jagannadh,venkatesh next movies  వెంకటేష్ వరుస ఇలా వుంది..!
వెంకటేష్ వరుస ఇలా వుంది..!
Advertisement
Ads by CJ

70కి పైగా చిత్రాలలో నటించిన సీనియర్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం హిందీ 'సాలా ఖద్దూస్‌' రీమేక్‌గా సుధ కొంగర దర్శకత్వంలో 'గురు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 31న విడుదల కానుంది. ఈ చిత్రంలో వెంకీ ఓ మిడిల్‌ ఏజ్‌డ్‌ బాక్సింగ్‌ కోచ్‌గా రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపిస్తున్నాడు. మరోపక్క ఆయన తన తర్వాతి చిత్రంగా 'నేను...శైలజ' ఫేమ్‌ కిషోర్‌ తిరుమలతో 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' చేయాల్సివుంది. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రం హోల్డ్‌లో ఉంది. ఉగాదికి కిషోర్‌ తిరుమల - రామ్‌ల కాంబినేషన్‌లో కొత్త చిత్రం ప్రారంభం కానున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. 

కానీ కిషోర్‌ చిత్రాన్ని వెంకీ ఎందుకు హోల్డ్‌లో పెట్టాడో తెలియడం లేదు. ఇక వెంకీ.. పూరీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని... హెవీ బడ్జెట్‌ కారణంగా ఈ చిత్రం ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. ఇక పూరీ కూడా బాలయ్యతో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత అంటే అక్టోబర్‌ మొదటి వారం నాటికి వెంకీ - పూరీల చిత్రం పట్టాలెక్కనుంది. ఆ తర్వాత వెంకీ మరో మంచి కథ దొరికితే క్రిష్‌ దర్శకత్వంలో సినిమా చేస్తానని తెలిపాడు. మరోవైపు బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో 'ఘాజీ' వంటి చిత్రం తీసిన సంకల్ప్‌రెడ్డి అనే కుర్రదర్శకునితో కూడా వెంకీ పనిచేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ