పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు' ఈ శుక్రవారం విడుదలై మిక్స్డ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పంచె కట్టు, కోర మీసంతో అందరిని ఆకట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ నటన ఈ చిత్రానికే హైలెట్. అయితే పవన్ నటించిన 'కాటమరాయుడు' చిత్రాన్ని ఆదివారం తెలంగాణ మంత్రి కేటీఆర్ వీక్షించారు. ఈ చిత్రాన్ని మంత్రి కేటీఆర్, పవన్ కళ్యాణ్ తో కలిసి కూర్చుని చూసారు. కాటమరాయుడు చూసిన తర్వాత ఆయన పవన్ కి కాటమరాయుడు చిత్ర నిర్మాత శరత్ మరార్ కి అభినందనలు తెలిపారు. 'కాటమరాయుడు' చిత్రం చాలా బాగుందని కేటీఆర్ మెచ్చుకున్నారు.
అలాగే పవన్ నటన అద్భుతమని కితాబునిచ్చారు. అంతేకాకుండా కేటీఆర్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ ముందుకు వచ్చి చేనేత వస్త్రాలకు ఉచిత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరించడం.... ఈ 'కాటమరాయుడు' చిత్రంలో పవన్ చేనేత వస్త్రాలతో కనిపించడం వంటి అంశాలను తనకు బాగా నచ్చాయని... చేనేత వస్త్రాలకు సూపర్ ప్రమోషన్ చేశారని మెచ్చుకున్నారు. మరి ఏదైనా రాజకీయాలు వేరు, స్నేహ బంధం వేరని ఈ ఇద్దరూ కూడా మరోసారి నిరూపించారు.