మోదీ ప్రధానిగా చేస్తున్నాడు. అదే సమయంలో 2019లో కూడా తిరిగి ప్రధాని కావాలనుకుంటున్నాడు. ఇందులో తప్పులేదు. ఇక ఆయన తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న యోగి ఆదిత్యానాథ్‌ని చూసి అభధ్రతాభావం పెంచుకుంటున్నాడు. పదవి చేపట్టి ఇంకా వారం కాకముందే యోగి ఆదిత్యానాద్ కేవలం ఈ తక్కువ వ్యవధిలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అవినీతి ఆరోపణలున్న పోలీసులను, కుల బలంతో ఊగుతున్న యాదవ్‌లను అదుపులో పెడుతున్నాడు. అక్రమ కబేళాలను మూసివేయించాడు. రౌడీయిజాన్ని ఏరిపారేస్తున్నాడు. కార్యాలయాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించాడు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా యుపి, బీహార్‌లలో ఎక్కువ వినియోగంలో ఉన్న పాన్ వాడకాన్ని నిషేధించనున్నాడు. ఇక యుపి,
బీహార్‌ల మద్య నడుస్తున్న పర్మిట్‌లేని వాహనాలను నిషేధించాడు. ఆడపిల్లలను ర్యాగింగ్ బారి నుంచి రక్షిస్తున్నాడు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్కోగుతూ టాక్ ఆఫ్ ఇండియా అయ్యాడు. ఆయన్ను 2024 ప్రధానిగా అందరూ భావిస్తున్నారు. కానీ దీన్ని మోదీ సహించలేకపోతున్నాడు.