Advertisementt

నవ మన్మధుడిలా..నాగ్ కే సాధ్యం..!

Mon 27th Mar 2017 12:22 AM
nagarjuna,raju gari gadhi 2,om namo venkatesaya  నవ మన్మధుడిలా..నాగ్ కే సాధ్యం..!
నవ మన్మధుడిలా..నాగ్ కే సాధ్యం..!
Advertisement
Ads by CJ

తాజాగా కింగ్‌ నాగార్జున ఓంకార్‌ దర్శకత్వంలో 'రాజుగారి గది2'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో నాగ్‌ మనుషుల మనసుతో ఆడుకునే పాత్రను చేస్తున్నాడు. ఇటీవల జరిగిన పాండిచ్చేరి షెడ్యూల్‌కి చెందిన స్టిల్స్‌ని పోస్ట్‌ చేసి షెడ్యూల్‌ ముగిసిందని నాగ్‌ సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫోటోలను పోస్ట్‌ చేసి రెండుమూడు రోజులవుతున్నా కూడా ఇప్పటికీ ఆ ఫోటోలు ఇంకా సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. నిన్న గాక మొన్న 'ఓం నమో వేంకటేశాయ'లో మధ్యవయస్కుడిగా, లావుగా, బరువు పెరిగి కనిపించిన నాగ్‌ ఈ అతికొద్ది సమయంలోనే పూర్తిగా మేకోవర్‌ అయి, కుర్రాడిలా అల్ట్రామోడ్రన్‌గా కనిపిస్తుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బరువు పెరగడానికి, తగ్గడానికి, సిక్స్‌ప్యాక్‌ల కోసం రాత్రింబగళ్లు కష్టపడితే గానీ సాద్యం కాని ఈ ఫీట్‌ను నాగ్‌ ఈ వయసులో అతి కొద్దిగ్యాప్‌లో చేసి చూపించడం ఔరా అనిపిస్తోంది.

ఆయన్ను చూస్తే కాబోయే మామ, కాబోయే తాత అంటే ఎవ్వరూ నమ్మేలా లేరు. షష్టిపూర్తికి దగ్గర పడిన హీరోలా ఆయన కనిపించడం లేదు. మొత్తానికి నిన్నటితరం వారే కాదు.. నేటితరం వారు కూడా నాగ్‌ గ్లామర్‌ సీక్రెట్‌ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ