Advertisementt

చిన్న సినిమాల టీజర్స్..మిలియన్ వ్యూస్!

Sun 26th Mar 2017 06:17 PM
kesava,mister,varun tej,nikhil,million views  చిన్న సినిమాల టీజర్స్..మిలియన్ వ్యూస్!
చిన్న సినిమాల టీజర్స్..మిలియన్ వ్యూస్!
Advertisement
Ads by CJ

వాస్తవానికి పెద్ద పెద్ద చిత్రాలు, స్టార్స్‌ మూవీస్‌ టీజర్స్‌, ట్రైలర్స్‌ మాత్రమే యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తాయి. కానీ ఇటీవల మీడియం రేంజ్‌కి చెందిన రెండు చిత్రాల టీజర్స్‌, ట్రైలర్స్‌ కూడ మంచి వ్యూస్‌ సాదించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. వరుస ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తోన్న నిఖిల్‌ హీరోగా తనకు హీరోగా మొదటి బ్రేక్‌నిచ్చిన సుధీర్ వర్మ డైరెక్షన్‌లో రూపొందుతోన్న మరో విభిన్న చిత్రం 'కేశవ'. ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ను సాధిస్తోంది. 

ఇక తన బకరా ఫార్ములాను పక్కనపెట్టి, తనదైన పంచ్‌ డైలాగ్‌ల జోలికి పోకుండా, 'ఆగడు, బ్రూస్‌లీ' చిత్రాల ద్వారా పోయిన పరువును తిరిగి రాబట్టుకోవాలని చూస్తున్న దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగాహీరో వరుణ్‌తేజ్‌, లావణ్యత్రిపాఠి, హెబ్బాపటేల్‌ జంటగా రూపొందుతున్న చిత్రం 'మిస్టర్‌'. ఏప్రిల్‌14న విడుదలకు సిద్దమవుతోన్న ఈ చిత్రం రొటీన్‌ కథే అయినా 'ఆనందం, సొంతం' తరహాలో మంచి లవ్‌ఫీల్‌ మూవీగా తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం ట్రైలర్‌కు కూడా మొదటి రోజే మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. వరుణ్‌తేజ్‌ రేంజ్‌కి ఇది పెద్ద ఆదరణ కిందనే చెప్పాలి. మొత్తానికి ప్రస్తుతం 'కేశవ, మిస్టర్‌' చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తే ఉందని ఈ టీజర్‌, ట్రైలర్స్‌కి వస్తున్న రెస్పాన్స్‌ను బట్టి చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ