Advertisementt

సన్నీ.. మూడ్ కోసం అక్కడికెళ్లింది..!

Sat 25th Mar 2017 09:32 PM
sunny leone,summer trip,cancun beach  సన్నీ.. మూడ్ కోసం అక్కడికెళ్లింది..!
సన్నీ.. మూడ్ కోసం అక్కడికెళ్లింది..!
Advertisement
Ads by CJ

ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి, సేద తీరడానికి పోర్న్‌స్టార్‌, సెక్సీబాంబ్‌ సన్నిలియోన్‌ మెక్సికో వెళ్లింది. మెక్సికోలోని కంకన్‌ బీచ్‌లో ఆమె సేద తీరుతున్న ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఇక అక్కడి ఫొటోలలో ఆమె ఎప్పుడు తన ఫ్యాన్స్‌ని నిరాశ పరచదు అనే విధంగా కనిపిస్తోంది. నేను మెక్సికోలోని కొంకన్‌ బీచ్‌లో సేద తీరుతున్నాను. నాకు సూర్యకాంతి అంటే భలే ఇష్టం. ఇక ఈ వేసవిని బాగా ఎంజాయ్‌ చేసి, బాగా సేద తీరి, మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే మరలా సినిమాలలో మరింత యాక్టివ్‌గా ఉండవచ్చని ఆమె అంటోంది. 

కాగా ఈ ట్రిప్‌లో ఆమె భర్త డేనియల్‌ వైబర్‌ కూడా ఉన్నాడు. ఇక ఇటీవల ఆమె షారుఖ్‌ఖాన్‌ నటించిన 'రాయిస్‌' చిత్రంలో 'లైలా ఓ లైలా...' రీమిక్స్‌లో అదరగొట్టింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌లో ఆమె ఇమేజ్‌ మరింతగా పెరిగింది. స్టార్‌ హీరోలు కూడా తమ చిత్రాలలో ఆమె పాట ఉండేలా చూసుకుంటున్నారు. కాగా త్వరలో ఆమె పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించే చిత్రంలో నటించనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ