Advertisementt

ఇది దండయాత్ర..మంచు హీరో దండయాత్ర!

Sat 25th Mar 2017 09:18 PM
  ఇది దండయాత్ర..మంచు హీరో దండయాత్ర!
ఇది దండయాత్ర..మంచు హీరో దండయాత్ర!
Advertisement
Ads by CJ

గత కొన్నాళ్లుగా సరైన బ్రేక్‌ లేని హీరో.. మంచు విష్ణు. కాగా ఆయన ప్రస్తుతం సమకాలీన రాజకీయాల నేపథ్యంలో కార్తీక్‌ రెడ్డి దర్శకత్వంలో 'ఓటర్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆయన తండ్రి మోహన్‌బాబు నటించిన 'అసెంబ్లీ రౌడీ' చిత్రం తరహాలో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో ఆయన తనకు మంచి హిట్స్‌ ఇచ్చిన జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో త్వరలో 'ఆచారి అమెరికా యాత్ర' అనే డిఫరెంట్‌ మూవీ చేయనున్నాడు.  

ఈ చిత్రం కథ ఓ రియల్‌ లైఫ్‌లో జరిగిన ఓ స్కాం ఆదారంగా వినోదభరితమైన సందేశాత్మక చిత్రంగా రూపొందనుందని సమాచారం. ఇటీవల అమెరికాలో కాల్‌సెంటర్ల పేరుతో ఎన్నారైలను మోసగించిన ఓ స్కాం ఆధారంగా ఈ చిత్రం కథను తయారు చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బ్రహ్మానందం కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. మొత్తానికి తన పోరాటాన్ని మాత్రం మంచు విష్ణు ఇంకా కొనసాగిస్తూ బాక్సాఫీస్‌ మీద దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. మరి 'లక్కున్నోడు' అని చెప్పుకున్నా హిట్ రాని మంచు విష్ణు కి ఈ రెండు సినిమాలతో అయినా హిట్ వచ్చేనా..| 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ