Advertisementt

ఎన్టీఆర్ సినిమాలో ఈ లక్కీ భామ కూడానా!

Sat 25th Mar 2017 08:23 PM
jr ntr,bobby,hamsanandini,hamsanandini in ntr 27th film  ఎన్టీఆర్ సినిమాలో ఈ లక్కీ భామ కూడానా!
ఎన్టీఆర్ సినిమాలో ఈ లక్కీ భామ కూడానా!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ తన 27 వ చిత్రాన్ని మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. 'జనతా గ్యారేజ్' హిట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని బాబీ డైరెక్షన్ లో కొత్త చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఈ చిత్రం మొదలైనప్పటి నుండి కూడా ఈ చిత్రంపై రకరకాల వార్తలు రోజూ ఏదో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే వుంది. అందులో ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాడని... మూడు విభిన్న పాత్రల కోసం బాగా కష్టపడుతున్నాడని..... ఈ సినిమా టైటిల్ గురించి అబ్బో ఒకటేమిటి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ముఖ్యంగా వెబ్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

ఇక ఈ చిత్రానికి 'జై లవ కుశ' టైటిల్ దాదాపు ఫిక్స్ అని నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్స్ ఇంకా పూర్తిగా సెట్ అవలేదు గాని ఇప్పుడు ఒక ముఖ్య పాత్ర కోసం హంసానందిని ని తీసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే హంస పలు చిత్రాల్లో  ఐటెం సాంగ్స్ లో నర్తించింది. అయితే ఆమె ఐటెం చేసిన సినిమాలన్నీ చాలా వరకు హిట్ అయ్యాయి. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రంలో కూడా హంసానందిని కి ఒక స్పెషల్ కేరెక్టర్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. ఇందులో హంసానందిని రోల్ సంథింగ్ స్పెష‌ల్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది.

ఇప్పటికే ఎన్టీఆర్ చిత్రంలో హంసానందిని పై కొన్ని సీన్స్ చిత్రీకరణ పూర్తయినట్లు కూడా సమాచారం అందుతుంది. మరి ఆమెను ఏ పాత్రకి ఎంపిక చేశారో తెలియదు గాని... ఇప్పటికి ఒక హీరోయిన్ గా రాశి ఖన్నాని ఎంపిక చేసిన చిత్ర యూనిట్ మరో హీరోయిన్ గా నివేద థామస్ ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లుగా వార్తలయితే వచ్చాయి... కానీ చిత్ర యూనిట్ ఇంతవరకు దానిని కన్ఫర్మ్ చెయ్యలేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ