Advertisementt

తమిళ పాలిటిక్స్: కుచ్చుటోపీ, కరెంట్‌షాక్‌!

Sat 25th Mar 2017 08:14 PM
tamil nadu,hat,current poll,jayalalitha,rak nagar,pannir selvam,sasikala  తమిళ పాలిటిక్స్: కుచ్చుటోపీ, కరెంట్‌షాక్‌!
తమిళ పాలిటిక్స్: కుచ్చుటోపీ, కరెంట్‌షాక్‌!
Advertisement
Ads by CJ

ఏప్రిల్‌12న స్వర్గీయ జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కేనగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో అక్కడ రాజకీయాలు బాగా వేడెక్కాయి. శశికళ, పన్నీరు సెల్వంలు ఇద్దరు రెండాకుల గుర్తు కోసం పోటీ పడినా కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆ గుర్తును తాత్కాలికంగా ఎవ్వరికీ కేటాయించలేదు. ఈ ఉప ఎన్నికలు జరిగి విజేత తెలిసిన తర్వాత ప్రజాభిప్రాయానికి తగ్గట్లుగా రెండాకులను ఎవరికి కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో శశికళ వర్గానికి టోపీ గుర్తును, పన్నీర్‌సెల్వంకు ఎలక్ట్రిక్‌ పోల్‌ను ఎన్నికల కమిషన్‌ ఇచ్చింది. శశికళ గెలిస్తే కుచ్చుటోపీ పెట్టడం ఖాయమని ఒక వర్గం అంటుండగా, మరోవర్గం పన్నీర్‌సెల్వంకు చెందిన పార్టీకి ప్రజలు ఎలక్ట్రిక్ట్‌ పోల్‌ను తాకితే వచ్చే కరెంట్‌షాక్‌ ఇస్తారని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 

కాగా శశికళ వర్గం కేంద్ర ఎన్నికల కమిషన్‌ మీద తమకు రెండాకుల గుర్తు ఇవ్వకుండా కుట్ర జరిగిందని ఇన్‌డైరెక్ట్‌గా బిజెపిని టార్గెట్‌ చేసింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమదే విజయమని, రెండాకుల గుర్తు కూడా భవిష్యత్తులో తమకే ఇస్తారనే వాదన వినిపిస్తున్నారు. ఇక శిశకళ వర్గం ఈ ఎన్నికల్లో స్వర్గీయ ఎంజీఆర్‌ బతికున్నప్పుడు టోపీ ధరించే వాడని, కాబట్టి తమకు టోపీ గుర్తు కూడా సెంటిమెంట్‌పరంగా కలిసొస్తుందనే వాదన వినిపిస్తున్నారు. మరి చూద్దాం.. తమిళ ప్రజల తీర్పు ఏ విఢంగా ఉంటుందో...?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ