Advertisementt

చంద్రబాబు ఆ ఒక్కటి ఎందుకు దాస్తున్నారు?

Sat 25th Mar 2017 05:05 PM
chandrababu naidu,ap assembly,cash for vote  చంద్రబాబు ఆ ఒక్కటి ఎందుకు దాస్తున్నారు?
చంద్రబాబు ఆ ఒక్కటి ఎందుకు దాస్తున్నారు?
Advertisement
Ads by CJ

నోటుకు ఓటు తిప్పలు చంద్రబాబును తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చార్జిషీట్‌లో చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీం కోర్టు నోటీసులతో బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కాగా ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్‌ చేస్తుంటే, పక్క రాష్ట్రంలో జరిగిన ఘటన మీద మన రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడటాన్ని టిడిపి తప్పుపడుతోంది. కాగా ఓటుకు నోటు కేసులో ప్రజలకు కూడా పలు సందేహాలున్నాయి. వాటిని తీర్చాల్సిన బాద్యత సీఎం చంద్రబాబుకు ఉంది. నేను అవినీతిని చేయను.. సహించను అని చెప్పే కంటే ఈ ఆడియో టేపులో ఉన్నది తన గొంతుకాదని మాత్రం ఆయన గట్టిగా చెప్పడం లేదు. సంఘటన ఎక్కడ జరిగినా కూడా సీఎంకు ఆ మాత్రం బాధ్యత, పారదర్శకత అవసరం లేదా? అనే విషయం అధికార టిడిపికి తెలియాలి. 

తన నిజాయితీ గురించి, డెయిరీ వ్యాపారం గురించి చెబుతున్న బాబు.. ఓటుకు నోటు విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నాడు. వాస్తవానికి నోటుకు ఓటు వంటివి రాజకీయాల్లో కామన్‌ అయిపోయాయి. అందరు అదే దారిలో నడుస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని తన తప్పుగా ఒప్పుకున్నా కూడా బాబుకు ఇబ్బంది లేదు. ఇక తెలంగాణ అసెంబ్లీలో హరీష్‌రావు.. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకు మైకు ఇవ్వడం లేదని, తాము ఇస్తున్నామని చెప్పాడు. మరి ఏపీ అసెంబ్లీ గురించి తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావించడం తప్పే అయితే అది అందరికీ వర్తిస్తుంది? కదా వంటి అనేక సందేహాలు సామాన్యులకు కలుగుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ