Advertisementt

సి కళ్యాణ్ కొడుకు చిల్లర వ్యవహారం..!

Sat 25th Mar 2017 02:31 PM
c kalyan,c varun,varun robbery case,producer c kalyan son  సి కళ్యాణ్ కొడుకు చిల్లర వ్యవహారం..!
సి కళ్యాణ్ కొడుకు చిల్లర వ్యవహారం..!
Advertisement
Ads by CJ

సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన నిర్మాత చిల్లర కళ్యాణ్. సి కళ్యాణ్ గా సుప్రసిద్ధుడైన ఈయన కుమారుడు చిల్లర వరుణ్ కుమార్. ఇతడు చేసిన ఓ ఘనకార్యం కారణంగా సి కళ్యాణ్ విషయం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. అతడు చేసిన పని కూడా చాలా చిల్లరగానే ఉంది. అంతటి స్థాయి కలిగిన వ్యక్తి కుమారుడు అంతటికి దిగజారాడంటే అందరూ అవాక్కవుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ కుమారుడు సి వరుణ్ కుమార్ పై చోరీ కేసు నమోదైంది. 

అయితే ఈ కేసుకు సంబంధించి అందుతున్న సమాచారాన్ని బట్టి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన ట్రాన్స్ పోర్ట్ వ్యాపారి గురువారం తన కుమారుడితో కలిసి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కు వచ్చాడు. అయితే స్విమ్మింగ్ కోసం అక్కడికి వచ్చిన ఆయన అక్కడ దగ్గరలోనే పర్స్ పెట్టి స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో పర్స్ మిస్సయింది. ఆ పర్స్ లో పలు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. 

కానీ పర్స్ పోయిన గంటకే కార్డులో ఉన్న నగదు మొత్తం వేరే అకౌంటులోకి బదిలీ అయ్యింది. దాంతో ఖంగుతిన్న ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. పోలీసులు విచారించగా యాక్సిస్ బ్యాంకు కార్డు నుంచి రూ.1.82 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు నుంచి రూ.27600 ఆ మొత్తం నగదు చిల్లర వరుణ్ కుమార్ ఖాతాలో జమ చేసుకున్నట్లుగా తేలిపోయింది. ఇంకా అక్కడ సీసీ కెమేరాల ద్వారా పరీక్షిస్తే కూడా వరుణ్ కుమారే పర్సు దొంగిలించినట్లుగా తేలింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ