Advertisementt

ఎన్టీఆర్ 27వ చిత్ర టైటిల్ కి క్లూ ఇచ్చేశారు!

Fri 24th Mar 2017 05:05 PM
jr ntr,jai lava kusa,jr ntr 27th film,harikrishna in jr ntr movie set  ఎన్టీఆర్ 27వ చిత్ర టైటిల్ కి క్లూ ఇచ్చేశారు!
ఎన్టీఆర్ 27వ చిత్ర టైటిల్ కి క్లూ ఇచ్చేశారు!
Advertisement
Ads by CJ

బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. మూడు విభిన్న పాత్రలు చేస్తున్న ఎన్టీఆర్ సినిమా పేరు 'జై లవ కుశ' అని జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఆ టైటిల్ ని ఎక్కడా అధికారికంగా ప్రకటించకుండా సస్పెన్స్ మెయింటింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి 'జై లవ కుశ' టైటిల్ ఫిక్స్ అని ఒక ఫోటో ద్వారా స్పష్టమవుతుంది.

తాజాగా ఎన్టీఆర్ 27 వ చిత్ర సెట్స్ లో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సందడి చేశారు. ఇక్కడ ఎన్టీఆర్ ని అయితే రివీల్ చెయ్యలేదు గాని ఎన్టీఆర్ ఎదురుగా వున్న హరికృష్ణ ని మాత్రమే చూపిస్తూ ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిత్ర యూనిట్ వాళ్ళు. ఇంకా ఆ పిక్ లో ఎన్టీఆర్ టేబుల్ మీద ఎన్ లవ కుమార్ అనే నేమ్ ప్లేట్ కూడా  అస్పష్టం గా కనబడుతుంది. అంటే మూడు పాత్రల్లో ఒక పాత్ర పేరు లవ కుమార్ అయితే... మిగిలిన రెండు పాత్రల పేర్లు కూడా ఒకటి  జై కాగా మరొకటి కుశ అనేగా దీనర్ధం.

అందుకే ఆ ఫొటో ని చూసిన వారంతా ఎన్టీఆర్ 27 వ చిత్రం టైటిల్ 'జై లవ కుశ' అని ఫిక్సయిపోండని చెబుతున్నారు. మరి నిజంగానే అభిమానులకి, ప్రేక్షకులకి తెలియాలనే ఇలా చిన్నపాటి క్లూనీ చిత్ర యూనిట్ వదిలిందా అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ సినీప్రియులు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ