ప్రస్తుతం దక్షిణాదిలో రూపొందుతున్న 'బాహుబలి - దికన్‌క్లూజన్, 2.0 ' చిత్రాలు అందరిలో ఆసక్తినిపెంచుతున్నాయి. ఈ రెండు చిత్రాల దెబ్బకు దేశం, ప్రపంచం మొత్తం దక్షిణాదివైపు చూస్తోంది. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం దీన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. 'బాహుబలి 2, 2.0 'ల శాటిలైట్ రైట్స్ బాలీవుడ్ చిత్రాల కంటే ఎక్కువగా 100కోట్లకు పైగా సాధించి రికార్డులు నెలకొల్పాయి. దీంతో 'పీకే, దంగల్' చిత్రాల రికార్డులు బద్దలయ్యాయి.
కానీ తాజాగా బాలీవుడ్ మీడియా మరో వాదనను తెరపైకి తెచ్చింది. మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ రేసులో లేనట్లే కనిపిస్తాడు గానీ ఆయన దెబ్బకు తట్టుకోవడం ఎవ్వరి వల్లా కాదని, తన 'పీకే, దంగల్' చిత్రాల రికార్డులు బద్దలు కావడంతో అమీర్ తన తాజా చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రం శాటిలైట్ రైట్స్‌ను ఏకంగా 130కోట్లకు అమ్మి, బాహుబలి, 2.0ల రికార్డులను తిరగరాసి మరలా తన రికార్డు తన పేరిటే లిఖించుకున్నాడని హైలైట్‌చేసింది.
కాగా ఓ ఆంగ్ల నవల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కూడా దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న బందిపోట్లు, దోపిడీ దొంగల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో అమీర్‌తో పాటు అమితాబ్ కూడా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి 'ధూమ్3 ' దర్శకుడు విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం 2018 ద్వితీయార్ధంలో విడుదల కానుంది.