బాలీవుడ్ లో హిట్ అయిన ‘హంటర్’ సినిమాకు రీమేక్ గా అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘బాబు బాగా బిజీ’ చిత్రం.. టీజర్ తో ట్రైలర్ తో పిచ్చెక్కించేస్తుంది. టీజర్ తోనే రొమాన్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘బాబు..’ ఇప్పుడు ట్రైలర్ తో కూడా అంతే సెక్సీ సెన్సేషన్ కి తెర తీశాడు. రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పినప్పటికీ కేవలం రొమాంటిక్ యాంగిల్ లోనే ఈ చిత్రాన్ని తీసినట్లు కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే.
మరీ ఇంత రొమాన్స్ తో సినిమాని తెరకెక్కించి ప్రేక్షకులని కనువిందు చెయ్యాలని దర్శకుడు నవీన్ మేడారం అనుకున్నట్టున్నాడు. అందుకే కేవలం రొమాన్స్ ని నమ్ముకునే అవసరాలతో ఇలాంటి అడల్ట్ కామెడీ చిత్రంలో చేయిస్తే సినిమాకి కూడా హైప్ వస్తుందని అనుకున్నట్టున్నాడు. అందుకే హీరోయిన్స్ దగ్గరనుండి అవసరాల శ్రీనివాస్ ని కూడా బాగా రొమాంటిక్ గా వాడేసాడు దర్శకుడు. ఇక అవసరాల హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, యాంకర్ శ్రీముఖి లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే డైరెక్టర్ గా నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ ఇలా ఒక అడల్ట్ చిత్రంలో నటించడం అనేది కొంచెం సాహసోపేత నిర్ణయంగానే చెప్పాలి. చూద్దాం కేవలం ట్రయిలర్, టీజర్ లోనే ఇంత రొమాన్స్ ఉంటే సినిమాలో ఇంకెంత ఉంటుందో..!