సినీ ప్రముఖులకు సంబందించిన పలు చీకటి రహస్యాలను, వీడియోలను, ఫొటోలను పోస్ట్ చేసి గాయని సుచిత్ర సంచలనం సృష్టించింది. ఆమె లీక్స్‌తో యావత్ పరిశ్రమ దిమ్మెరపోయింది. ఈ ఫొటోలలో ఉన్నది తాము కాదని ఎవ్వరూ బహిరంగంగా చెప్పలేని పరిస్దితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఆమె మానసిక ఆరోగ్యం బాగాలేదని, ఆమె అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని వాదనలు మొదలయ్యాయి. కాగా ఆమెకు మత్తు ఇచ్చి ధనుష్, అనిరుధ్ లు లైంగిక వాంఛలు తీర్చుకున్నందుకు ఆమె ప్రస్తుతం పగ తీర్చుకుంటోందని, గతంలో గాయని చిన్మయికి కూడా పలు సార్లు అబార్షన్ అయిందనే వార్తలు బయటకు వచ్చాయి. త్వరలోనే మరిన్ని విషయాలను, వీడియోలను, ఫొటోలను పెడతానని కూడా సుచిత్ర తెలిపింది.
కానీ గత కొద్ది రోజులుగా ఆమె నుంచి ఏ అప్‌డేట్స్ లేవు. దాంతో ఆమెను కొందరు తమిళ సినీ ప్రముఖులు కిడ్నాప్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ మీడియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. మరికొందరు మాత్రం సుచిత్ర మానసిక చికిత్స కోసం విదేశాలకు వెళ్లిందని అంటున్నారు. మొత్తానికి సుచిత్ర ఏమైంది? అనే విషయంలో ప్రస్తుతం అనేక అనుమానాలున్నాయి.
ధనుష్, అనిరుద్‌లతో పాటు ఆమె భర్త వైఖరిపై కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎవరైనా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తేగానీ వారు పట్టించుకునే పరిస్థితి లేదని కొందరు ఆవేదన చెందుతున్నారు. ఇక ఇలాంటి విషయాలలో ముందుండే రియల్‌హీరో విశాల్ అయినా సుచి పరిస్థితిపై స్పందిస్తాడా? అనేది వేచిచూడాలి. మొత్తానికి సుచి వ్యవహారం ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా మారింది.