'కాటమరాయుడు' థియేటర్స్ లోకి వచ్చే సమయం దగ్గరపడుతున్న కొలది పవన్ ఫ్యాన్స్ హంగామా ఆకాశాన్నంటుతోంది. ఇక 'కాటమరాయుడు' టీమ్ కూడా పబ్లిసిటీని పెంచేసింది. ప్రింట్ మీడియా దగ్గర నుండి వెబ్ మీడియా వరకు 'కాటమరాయుడు' గురించి విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం తమిళ 'వీరం'కి రీమేక్ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ పవన్ క్రేజ్ వలన ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్స్, ఫొటోస్, అందరిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికే గ్రాండ్ లెవల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని జరుపుకున్న 'కాటమరాయుడు' టీమ్ పబ్లిసిటీలో భాగంగా మీడియా కి ఇంటర్వ్యూ లు గట్రా ఇస్తుందని... అందులోను పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ అయితే ఇంకా స్పెషల్ గా వుంటుందనే ఆశతో చాలామంది ఎదురు చూస్తున్నారు. మీడియా కూడా పవన్ ఇంటర్వ్యూ ల కోసం సకల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యింది. కారణం పవన్ ఎవరికీ దొరక్కుండా సైలెంట్ గా ఎక్కడికో చెక్కేశాడు. ఇక పవన్ ఇంటర్వ్యూ ల కోసం కాచుక్కూర్చున్న ఫ్యాన్స్ కి ప్రేక్షకులకి కూడా నిరాశే ఎదురైంది.
మరి ఇంతకు ముందు సినిమాలకు విపరీతంగా స్పెషల్ ఇంటర్వ్యూ లు ఇచ్చిన పవన్ ఈసారి 'కాటమరాయుడు' కి ఎందుకింత సైలెంట్ అయ్యాడనే చర్చ మొదలైంది. కాకపోతే 'కాటమరాయుడి'కి అనుకున్నంత క్రేజ్ ముందే వచ్చేసి పబ్లిసిటీ కూడా బాగా జరిగిందనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ ఇలా చేశాడని ఫ్యాన్స్ సరిపెట్టుకుంటున్నారట.