ఇళయరాజా తీరును తమ్మారెడ్డి భరద్వాజ తప్పు పడుతూనే మరో వాదాన్ని తెరపైకి తెచ్చాడు. ఇప్పుడున్న కాపీరైట్ చట్టం ప్రకారం గేయరచయితలకు, సంగీత దర్శకులకు, ఆడియో సంస్థలకు ఆ పాటలపై రాయల్టీ లభిస్తోందని, కానీ ఓ పాట పుట్టాలంటే మొదటగా నిర్మాత తన డబ్బుతో ఆ పాటను రాయించి, దర్శకునితో ఆ పాటకు ప్రాణం పోసి, తనకు కావాల్సిన విధంగా సంగీత దర్శకుని నుంచి ట్యూన్‌ని సంపాదిస్తాడని, కానీ రాయల్టీలో నిర్మాతలకు న్యాయం జరగడం లేదన్నారు.
ఇక విదేశాలలో సంగీత దర్శకులు, గాయనీ గాయకులే ప్రైవేట్ ఆల్బమ్స్‌ని రూపొందిస్తారని, కానీ మనదేశంలో సినీ సంగీతం ఎక్కువని, కానీ మన కాపీరైట్ చట్టంలో విదేశీ ఆల్బమ్‌ల విషయంలో చేసిన కాపీరైట్ చట్టాన్నే అమలు చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చాడు. అయినా ఇళయరాజా గారు ఇంకా ప్రజల నోళ్లలో నానుతున్నారంటే.. ఇప్పటికీ ఆ పాటలను పలు కచ్చేరిలలో గానం చేస్తూ, ప్రజల నోళ్లల్లో నానడమే కారణమని, అదే అలా పాడకపోతే ఎవ్వరినైనా ప్రజలు మర్చిపోతారని, ఇళయరాజా వాదన చట్టపరంగా ఓకేగానీ, నిజానికి ఇది భస్మాసుర హస్తం వంటిదని తమ్మారెడ్డి వాస్తవాలు వెల్లడించారు.