దర్శకరత్న దాసరి నారాయణరావు వైద్య ఖర్చులు భారీగా అయినట్టు తెలిసింది. ఈ నెల 30న డిశ్చార్జ్ అవుతున్నారు. దాదాపు 32 రోజులు హాస్పటల్లోనే గడిపారు. దాసరికి విఐపి హోదాలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. విఐపిల కోసం కిమ్స్ హాస్పటల్లో ప్రత్యేక సూట్ రూమ్‌లున్నాయి. వీటిలోనే ఆయనను ఉంచారు. ఒక్కో సూట్ రోజు వారి అద్దె 40 వేలు. దాసరి కుటుంబ సభ్యుల కోసం ఆ పక్కనే మరో 2 విఐపి సూట్ రూమ్‌లు తీసుకున్నారు. అంటే మొత్తం మూడు సూట్‌లకు రోజుకు లక్షా 20 వేలు అద్దె అన్నమాట. ఇది కాకుండా మధ్య మధ్యలో వచ్చే అతిథుల కోసం కూడా గదులు అద్దెకు తీసుకున్నారట. దాసరి సన్నిహితులు, కుటుంబసభ్యులు భోజనాలు, టిఫిన్లు, కాఫీలు గట్రా బిల్లు కూడా తడిసిమోపడైంది. ఖర్చు భారీగా పెరుగుతుండడంతో పది రోజుల క్రితం దాసరి విఐపి సూట్ నుండి సాధారణ గదికి మారినట్టు తెలిసింది.
దాసరి చికిత్స పొందుతున్న కిమ్స్ హాస్పటల్ యాజమాన్యంతో సినీ పరిశ్రమకు సత్సంబందాలున్నాయి. దాంతో బిల్లు విషయంలో కొంత తగ్గించారని, అయినప్పటికీ 90 లక్షలు అయిందనే మాట వినిపిస్తోంది. దాసరి మాజీ కేంద్రమంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు కావడం వల్ల ఈ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా లేక ఆయన చెల్లించాలా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.