ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
దాసరి డిశ్చార్జ్.. డేట్..!

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మార్చి 30న హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నట్టు తెలిసింది. గత నెల 26న ఆయన అస్వస్థకు గురికావడంతో హైదరాబాద్ కిమ్స్ హాస్పటల్లో చేర్చారు. ఊపిరి తిత్తులు, కిడ్నీ, జీర్ణాశయం వంటి సమస్యలు తలెత్తడంతో పలు దఫాలుగా వైద్యులు ఆపరేషన్ చేశారు. మొదటి నాలుగైదు రోజులు దాసరి హెల్త్ బులెటిన్‌లు విడుదల చేసింది కిమ్స్. ఆ తర్వాత విరమించుకున్నారు. దాసరి ఆరోగ్య పరిస్థితి కారణంగా పలు సార్లు ఆపరేషన్లు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడడంతో ఆయనను డిశ్చార్జ్ చేస్తున్నారు.
dasari narayana rao
dasari narayana rao discharge
kims








































