'ఆగడు, బ్రుస్ లీ' చిత్రాల ఘోర పరాజయంతో శ్రీను వైట్ల కష్టాల సుడిగుండంలో పడిపోయాడు. ఇక వైట్ల పని అయిపోయిది అనుకుంటున్న సమయంలో మెగా హీరోతో మరొక అవకాశం వచ్చింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న వరుణ్ తేజ్ తో, శ్రీను వైట్ల మిస్టర్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మిస్టర్ మూవీలో వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ 'మిస్టర్' మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు.
ఈ ట్రైలర్ లో వరుణ్ తేజ్ ని క్లాస్ లుక్ తో చూపిస్తూనే మాస్ పంచ్ ను చూపించాడు శ్రీను వైట్ల. మిస్టర్ పర్ఫెక్ట్ గా వరుణ్ తేజ్ ఈ ట్రైలర్ లో దర్శన మిస్తున్నాడు. ఇక హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా ఒక ఉన్నత కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిలాగా మోడరన్ లుక్ లో ఈ ట్రైలర్ లో దర్శనమిచ్చింది. లావణ్య త్రిపాఠి అయితే పక్కా పల్లెటూరి అమ్మాయిలా కనబడుతుంది. ఈ చిత్ర ట్రైలర్ లో డైలాగ్స్ బావున్నాయి. కామెడీ, ఎమోషన్స్, ప్రేమ, పగ, యాక్షన్ ఇలా మొత్తం కలగలిపి ఏదీ తక్కువ కాకుండా ఈ సినిమాలో వున్నట్లుగా ఈ ట్రైలర్ ప్రేక్షకులకు చేరవేస్తుంది. చూడడానికి ప్రభాస్ Mr. పర్ఫెక్ట్ లా అనిపిస్తున్నా..అందరినీ ఆకట్టుకునేలా సినిమాలో ఏదో విషయం వుంది అనేలా ట్రైలర్ ని కట్ చేసాడు శ్రీను వైట్ల. అలాగే గుహన్ ఫోటోగ్రఫీ చాలా రిచ్ గా వుంది. జీవితం మనల్ని చాలా చోట్లకి తీసుకెళుతుంది. కానీ ప్రేమ, జీవితం వున్న చోటుకే తీసుకెళుతుంది...వంటి డైలాగ్..మరో సారి శ్రీను వైట్ల నుండి మంచి మూవీ రాబోతుంది అనే సూచనలను తెలియచేస్తుంది.
ఇక శీను వైట్ల కామెడీ ని నమ్ముకునే చాలా చిత్రాలు హిట్ కొట్టి టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయాడు. కానీ అదే కామెడీతో కొన్నిసార్లు ప్లాపులు కూడా చవిచూశాడు. మరి ఈ 'మిస్టర్' ట్రైలర్ చూస్తుంటే శ్రీను వైట్ల మరోమారు హిట్ ట్రాక్ ఎక్కుతాడనే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో....?