ఏపీలో పవన్, తెలంగాణలో కోదండరాంలు ప్రస్తుతం విపక్ష అవతారం ఎత్తి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఏపీలో పవన్ కిందటి ఎన్నికల్లో అధికార టిడిపికి మద్దతు పలికాడు. అదే విధంగా తెలంగాణలో కోదండరాం తెరాసా పట్ల కిందటి ఎన్నికల్లో సానుకూల పవనాలు వీచడంలో కీలకపాత్ర పోషించారు. పవన్ ప్రశ్నిండానికి వచ్చానన్నాడు. కోదండరాం తాను ప్రత్యేక తెలంగాణ కోసం వచ్చానన్నాడు. కానీ ఆ తర్వాత పవన్ రాజకీయ శక్తిగా ఎదగడానికి కృషి చేస్తున్నాడు. దీంతో కేవలం ప్రశ్నిండానికే అయితే రాజకీయపార్టీ పెట్టనవసం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇక తెలంగాణలో కోదండరాం నేతృత్వంలోని జేఏసీ.. ప్రత్యేక తెలంగాణ కోసమేనన్నాడు. కానీ ఈయన కూడా ప్రస్తుతం రాజకీయాలపై కన్నేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా జేఏసీ ఎందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కోదంరాంపై ఇప్పటికే తెరాసా మండిపడుతోంది. ప్రతిపక్షకాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపిలు చేయలేని పనిని కోదందరాం చేయడాన్ని కేసీఆర్‌తో సహా ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తెరాస ప్రభుత్వం, నాయకులు కోదండరాంను కాంగ్రెస్ ఏజెంట్‌గా, రెడ్డి ఆధిపత్యం ఉండే కాంగ్రెస్‌కు తొత్తుగా విమర్శలు వస్తున్నాయి.
ఇక పవన్ చంద్రబాబుకు ఏజంట్ అని, కాపు వర్గం ఓట్లు సాధించి, ఈ సారి చంద్రబాబుకు పరోక్షంగా సహాయం చేయబోతున్నాడనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ఇక తెలంగాణ, ఏపీలలో ఒకే రకం సమస్యలున్నాయి. నిరుద్యోగం, హామీలను నెరవేర్చకపోవడం, నియంతృత్వధోరణి, ఏపీలో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని, తెలంగాణలో నిరుద్యోగ నిరసనను అడ్డుకోవడం వంటివి చర్చనీయాంశాలయ్యాయి.
అలాగే కేంద్ర వివక్షత, కరవు, సాగునీరు, తాగునీరు, చేనేత కార్మికులు,రైతుల ఆత్మహత్యలు వంటి కామన్ ప్రాబ్లమ్స్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి కనిపిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల నాటికి కోదండరాం కూడా కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నాడు. మరి పవన్, కోదండరాంలు వచ్చే ఎన్నికల నాటికి కీలకంగా మారుతారా? రాజకీయ నాయకులుగా ప్రజలు వారిని ఆమోదిస్తారా? వంటి విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.