Advertisementt

హైద్రాబాద్ వాసులకు ఒకరోజు ముందే ఉగాది!

Thu 23rd Mar 2017 02:57 PM
hyderabad,ugadi,iffa awards,iffa awards 2017  హైద్రాబాద్ వాసులకు ఒకరోజు ముందే ఉగాది!
హైద్రాబాద్ వాసులకు ఒకరోజు ముందే ఉగాది!
Advertisement
Ads by CJ

గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి సక్సెస్ అయిన ఐఫా అవార్డ్స్ ని ఈ ఏడాది టాలీవుడ్ హెదరాబాద్ లో ఈ నెల 28, 29 న ఘనంగా నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఈ ఐఫా వేడుకకి గత ఏడాది టాలీవుడ్ టాప్ హీరోస్ హీరోయిన్స్ అందరూ హాజరై మెరుపులు మెరిపించారు. ఇక ఈ ఏడాది కూడా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతోపాటు యంగ్ హీరోలు రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లు కూడా హాజరవుతారని, అలాగే ఈ వేడుకకి టాప్  హీరోయిన్స్ కూడా సెంట్రాఫ్ అట్రాక్షన్ కాబోతున్నారని తెలుస్తోంది. 

తెలుగు, తమిళ, కన్నడ,మళయాళ భాషలకు గాను ఈ ఐఫా అవార్డులను ప్రముఖ హీరోల చేతుల మీదుగా ఆయా అవార్డు గ్రహీతలకు అందచేయనున్నారని...  ఐఫా డైరెక్టర్ ఆండ్రీ టిమిన్స్ మీడియాకి తెలియజేసారు. మొత్తం నాలుగు భాషలు హీరో హీరోయిన్స్ తో ఈసారి ఈ ఐఫా వేడుక కళకళలాడనుందన్న మాట. అయితే టాలీవుడ్ బెస్ట్ హీరో రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోపాటు అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని లతో పాటు ఈ మధ్యన హీరో గా ఎంట్రీ ఇచ్చిన పెళ్లిచూపులు ఫేమ్ విజయ్ దేవర కొండా వున్నారు.

ఉగాదికి ఒకరోజు ముందు ఐఫా వేడుకలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి అంటే హైదరాబాద్ వాసులకు ఒకరోజు ముందే ఉగాది వచ్చేసినట్లే. మరి టాలీవుడ్ హీరో హీరోయిన్స్ తో పాటు కోలీవుడ్, మాలీవుడ్‌, శాండిల్ వుడ్ హీరో హీరోయిన్స్ అందరూ ఒకే వేదిక మీద సందడి చేస్తుంటే ఒక రోజు ముందే ఉగాది వచ్చేసిందా అనే ఫీలింగ్ కలగక మానదు కదా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ