Advertisementt

చిరు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఊహా చిత్రం!

Wed 22nd Mar 2017 02:36 PM
chiranjeevi,uyyalawada narasimhareddy,chiru 151 movie  చిరు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఊహా చిత్రం!
చిరు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఊహా చిత్రం!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ రీఎంట్రిలో సూపర్ స్పీడ్ తో దూసుకుపోతూ మళ్ళీ టాలీవుడ్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేసాడు. అందుకే 150  చిత్రం 'ఖైదీ నెంబర్ 150' తో హిట్ కొట్టిన చిరు ఇప్పుడు తన 151 వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని సూపర్ స్పీడ్ గా మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ ని ఓకే చేసిన ఈ ఉయ్యాలావాడ టీమ్ చిరు లుక్ గురించి తర్జన భర్జనలు పడుతుంది. 

మరి ఎప్పుడో పూర్వ కాలం నాటి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథని తీసుకుని ఈ చిత్రం చేస్తున్నారు కాబట్టి చిరంజీవి లుక్  కూడా ఖచ్చితం గా ఓల్డ్ లుక్ లానే ఉండాలని రకరకాల ఊహ చిత్రాలు గీయిస్తూ బిజీ అయ్యారట. మరి ఉయ్యాలవాడ గా చిరు లుక్ కోసం ఇప్పటికే కొంతమంది ఆర్టిస్టులతో కొన్ని డ్రాయింగ్స్ కూడా వేయించారట. ఆ డ్రాయింగ్స్ లోని చిరు లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు అదిరిపోయే ఫోజులో కనిపిస్తున్నాడు. 

అయితే అది ఒరిజినల్ లుక్కా... లేదా అనేది డైరెక్టర్ గాని నిర్మాతగానీ స్పందిస్తే ఒకే అవుతుంది. కానీ ఈ చిరు ఉయ్యాలవాడ లుక్ కి మాత్రం విపరీతమైన స్పందన వస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ