Advertisementt

ప్రభుదేవా మరో హీరోయిన్ ని లైన్లో పెట్టాడంట!

Wed 22nd Mar 2017 01:43 PM
prabhudeva,nayanthara,tamanna,affair between tamanna and prabhudeva  ప్రభుదేవా మరో హీరోయిన్ ని లైన్లో పెట్టాడంట!
ప్రభుదేవా మరో హీరోయిన్ ని లైన్లో పెట్టాడంట!
Advertisement
Ads by CJ

నయనతార - ప్రభుదేవా ప్రేమ పీక్ స్టేజి లో ఉండగానే పెళ్లి చేసుకోవాలని ఆరాటపడ్డారు. నయన్ తో పెళ్లి కోసం ప్రభుదేవా తన భార్య రమాలతకి విడాకులు కూడా ఇచ్చేశాడు. అయితే ఇద్దరి మధ్యలో ఏమైందో తెలియదు నయన్ కి ప్రభుదేవా కి బ్రేక్ అప్ అయ్యి పెళ్లి కాస్తా క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత ఎవరి కెరీర్ మీద వారు దృష్టి పెట్టారు. మళ్ళీ నయన్,  విగ్నేష్ శివన్ తో లవ్ లో పడడం ఆ తర్వాత చాలా రోజులకి మళ్ళీ విగ్నేష్ శివన్ తో కూడా బ్రేకప్ చేసుకోవడం అన్ని చక చకా జరిగిపోయాయి.

ఇక ప్రభుదేవా తాను డైరెక్ట్ చేసే సినిమాలపైనే పూర్తి దృష్టి సారించాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రభుదేవా కూడా సైలెంట్ గా మరో హీరోయిన్ తో ప్రేమాయణం మొదలు పెట్టాడని తాజాగా అందుతున్న సమాచారం. ప్రభుదేవా హీరోయిన్ అయిన తమన్నాతో క్లోజ్ గా మూవ్ అవుతూ ఎవరికీ దొరక్కుండా లవ్ మెయింటింగ్ చేస్తున్నాడనే టాక్ బయటికి వచ్చింది. తమన్నాకి కూడా ప్రస్తుతానికి పెద్దగా సినిమా ఆఫర్స్ లేకపోవడంతో ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిండం మొదలు పెట్టి.. లైఫ్ లో సెటిల్ అవ్వాలని చూస్తుందట.

తమన్నాకి ప్రభుదేవా కి 'దేవి'(అభినేత్రి) సినిమా చేస్తున్నప్పటి నుండి వారి మధ్యన ప్రేమ మొదలైందని... కానీ ఈ విషయాన్ని సీక్రెట్ గా మైంటైన్  చేస్తున్నట్టు చెబుతున్నారు. ఎవరికీ తెలియకుండా ఇద్దరూ ఎక్కడో ఒక చోట మీట్ అవుతూ తమ రిలేషన్ ని స్ట్రాంగ్ గా చేసుకుంటున్నారంట. కానీ సెలబ్రిటీస్ ఎంత సీక్రెట్ ఉంచాలని  చూసినా ఇలాంటివి మాత్రం పబ్లిక్ అవడానికి ఎంతో సమయం పట్టదనేది జగమెరిగిన సత్యం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ