Advertisementt

'గురు' డు యమా స్ట్రిక్ట్..!

Wed 22nd Mar 2017 11:41 AM
guru,venkatesh guru movie trailer,guru movie trailer  'గురు' డు యమా స్ట్రిక్ట్..!
'గురు' డు యమా స్ట్రిక్ట్..!
Advertisement
Ads by CJ

వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గురు'. గురు చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్ లో చూపించిన విధంగానే మళ్ళీ 'గురు' ట్రైలర్ లోను చూపించారు. టీజర్ లో వెంకటేష్ చాలా కోపంగా తన దగ్గర బాక్సింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిలను చితగ్గొట్టటమే చూపించారు. ఇక ట్రైలర్ లో కూడా దానినే కంటిన్యూ చేస్తూ తన వద్దకు వచ్చే ట్రైనర్లు కరెక్ట్ టైం కి రాకపోవడం, సరిగ్గా రూల్స్ పాటించకపోవడం వంటి కారణాలతో వారిని శిక్షించడమే చూపించారు. అయితే చివరిలో మాత్రం కొద్దిగా ఆసక్తి కలిగించేలా హీరోయిన్ రితిక సింగ్ 'గురు ఐ లవ్ యు' అని చెప్పడంతో కాస్తంత ఆసక్తికలించేలా ప్లాన్ చేసింది  డైరెక్టర్ సుధా కొంగర . 

అయితే ఆ ఒక్క డైలాగ్ టోన్ కాకుండా ఇంకొన్ని డైలాగ్స్ తో సినిమాపై భారీగానే అంచనాలు పెరిగే లాక్ చేసారు. ఇక వెంకీ మాత్రం 'గురు' గా అదరగొట్టేసాడు. ఆ లుక్ లో వెంకటేష్ ఆ కేరెక్టర్ కి సరిగ్గా సరిపోయాడనే భావన కలుగుతుంది. లుక్, బాడీ లాంగ్వేజ్ తో వెంకటేష్ సూపర్బ్ గా అనిపించాడు. అయితే కొన్ని డైలాగ్స్ మాత్రం అదరహో అనిపించే రీతిలో పేలాయి 'గురు' ట్రైలర్ లో. 'ఊర కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టిన... దాని దృష్టాంతా ఎప్పుడూ పెంటమీదే వుంటుంద'నే డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి.

అయితే ట్రైలర్ లో ఎంత వయోలెన్స్ ఉన్నప్పటికీ డైలాగ్స్ తో, రొమాంటిక్ సన్నివేశంతో, బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాపై అంచనాలు అయితే భారీగానే పెంచగలిగారు. 

Click Here to see The Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ