మొత్తానికి పవన్‌కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' టీజర్, ట్రైలర్ చూసిన అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ చాలా ఆలస్యంగా రియాక్ట్ అయ్యాడు. టీజర్, ట్రైలర్స్ విడుదలైన చాలా రోజులకు చాలా ఎగ్జైట్ అయిన అల్లు శిరీష్,. ట్వీట్ చేస్తూ 'కాటమరాయుడు'లో నటించిన పవన్‌కు, దర్శకుడు డాలీకి, నిర్మాత శరత్‌మరార్‌కి ఆల్‌ది బెస్ట్ చెప్పాడు. ఇక 'సూరీడల్లే వచ్చాడు.. మన అందరి కాటమరాయుడు.. అంటూ కళ్యాణ్ బాబాయ్‌కి, డాలీకి, శరత్‌మరార్‌కి విషెష్ అని ట్వీట్ చేశాడు. కాగా అల్లు శిరీష్‌కి వరసగా పవన్ మామయ్య అవుతాడు. కానీ అల్లు శిరీష్ మాత్రం పొరపాటుగా బాబాయ్ అని ట్వీట్ చేయడంతో అందరూ ఆయోమయంలో పడిపోయారు.
అల్లు వారబ్బాయికి ఎగ్జైట్‌మెంట్ ఎక్కువై అలా ట్వీట్‌చేశాడా? లేక ఎక్కువగా రామ్‌చరణ్‌ని ఫాలో కావడం వల్ల చరణ్‌లాగానే శిరీష్ కూడా పవన్‌ని బాబాయ్ అనేశాడా? లేక చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు మీడియంలో చదివినందు వల్ల బాబాయ్, మావయ్యలిద్దరినీ అంకుల్ అని పిలవడం అలవాటై ఈ పొరపాటు చేశాడా? అని అందరూ గుసగుసలాడుతూ నవ్వుకుంటున్నారు.
అయితే చిన్నప్పటి నుండి చరణ్, హనీ అలా పిలవడం వల్ల, వాళ్ళని చూస్తూ నేను కూడా అలాగే పిలిచేవాడినని వివరణ ఇచ్చుకున్నా..ఇలాంటి టైం లో అతను ఇచ్చే వివరణ.. కూడా..ఎవరు నమ్మరు. పవన్ ని, పవన్ ఫ్యాన్స్ ని కాకా పట్టేందుకే ఇలా చేస్తున్నాడని అనుకుంటారు కదా!
ఇక అల్లుశిరీష్ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి నటిస్తున్న తొలి మలయాళ చిత్రం '1971' బియాండ్ ది బోర్డర్స్‌కి, తెలుగులో '1971 ఇండియా సరిహద్దు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. మేజర్ రవి దర్శకత్వం వహిస్తున్న.. ఇండో పాక్ యుద్ద నేపథ్యంలో చిత్రీకరించిన ఈ చిత్రం సమ్మర్‌లో మలయాళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.