Advertisementt

బాలకృష్ణ మూవీకి చిరంజీవి టైటిల్.!

Tue 21st Mar 2017 07:41 PM
  బాలకృష్ణ మూవీకి చిరంజీవి టైటిల్.!
బాలకృష్ణ మూవీకి చిరంజీవి టైటిల్.!
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది బాలకృష్ణ 101వ చిత్రం అన్న విషయం కూడా విదితమే. అప్పుడే.. దర్శకుడు పూరీ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసేశాడు. త్వరలో చిత్రబృందం షూటింగ్ కోసం యూరోప్ పయనం కాబోతుంది. అయితే బాలయ్యబాబు, పూరి కాంబినేషన్ లో తీస్తున్న ఈ చిత్రానికి టైటిల్ పై కూడా దృష్టి సారిస్తున్నాడంట దర్శకుడు. సహజంగా పూరి సినిమా టైటిళ్ళను పెట్టడంలో  చాలా వండర్ ఫుల్ గా స్టోరీకి కనెక్టు అయ్యేలా ఎంచుకుంటాడన్న విషయం అందరికీ తెలిసిందే.   

పూరి ఏ సినిమాకైనా టైటిల్ చాలా సహజంగా, కొన్నాళ్ళ పాటు ప్రేక్షకుల మదిలో నానేలా,  చాలా క్యాచీగా పెడుతుంటాడు. అది చాలా వైవిధ్యంతో కూడుకొని ఉండి ఆ పదం తాలూకూ చరిత్రను తెలుసుకొనేలా ఉంటుంది. అంటే ఎవ్రీ వర్డ్ హాజ్ ఇట్స్ ఎన్ ఓన్ హిస్టరీ అన్న చందంగా పూరి టైటిల్స్ పెట్టడంలో దిట్ట. తాజాగా బాలకృష్ణ చిత్రానికి పూరి ‘టపోరి’ అనే టైటిల్ పట్ల ఆకర్షించినట్లుగా తెలుస్తుంది. బాలకృష్ణకు కూడా ఈ టైటిల్ చెప్పగానే బహుబాగుంది అనేశాడట.  అయితే.. ఇప్పుడు ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే విషయంలో దర్శకుడు కొంత ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. అయితే విషయం ఏంటంటే.. టపోరి అనే టైటిల్ వినగానే చిరంజీవి సినిమాలో ఓ పాట గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ పాట కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. గ్యాంగ్ లీడర్ సినిమాలోని టపు టపు టపోరి అనే ఈ పాట ఎంతటి సెన్షేషన్ ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందుకనే దర్శకుడు  టైటిల్ పట్ల ఇంకా ఆలోచిస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. చూద్దాం పూరి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ